బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పిం చాలి

బీసీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకుగాను రాజ్యాంగాన్ని సవరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ జయశంకర్ సార్ హాల్‌లో సంఘం కన్వీనర్ కే వెంక అధ్యక్షతన బీసీ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ జనాభా ప్రకారం బీసీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం పెరిగేందుకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను కల్పించాలని, క్రిమిలేయర్ పద్ధతిని ఎత్తివేయాలని డిమాండ్‌చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కే లక్ష్మణ్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో దేశ ప్రధానిగా మోడీ నిలుస్తారని, బీసీ ఎజెండాతోనే బీజేపీ ముందుకు వెళ్తుందని చెప్పా రు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.