బీసీ ‘ఈ’ని తొలగించాలి

kishan
-బీసీల రిజర్వేషన్లను పరిరక్షించాలి
-బీజేపీ నిర్వహించిన బీసీ సంఘాల చైతన్య సదస్సులో వక్తలు
‘మా రిజర్వేషన్లు మాకే చెందాలి’ అని బీసీ సంఘాల చైతన్య సదస్సు నినదించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన 34 శాతం రిజర్వేషన్లలో బీసీ (ఈ) కేటగిరికి చెందిన వారు పోటీ చేయకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ కేటగిరిని తొలగించకుంటే విద్యా, ఉద్యోగాల మాదిరిగానే, రాబోయే రోజుల్లో రాజకీయంగా బీసీలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేసింది. బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటుచేసి చట్టబద్ధం చేయడంతోపాటు రూ.35వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసింది.

రిజర్వేషన్ల నుంచి బీసీ (ఈ)ని తొలగించాలని, బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులను కలవాలని, ఇదే డిమాండ్‌తో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. బీసీల రిజర్వేషన్ల పరిరక్షణ డిమాండ్‌తో భారతీయ జనతా పార్టీ బుధవారం ‘బీసీ సంఘాల చైతన్య సదస్సు’ నిర్వహించింది. సదస్సుకు 72 బీసీ సంఘాల బాధ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సులో బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తావూతేయ మాట్లాడుతూ బీసీ కేటగిరిలో ముస్లింలను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌డ్డి మాట్లాడుతూ బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లకు రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు పెంచాలని కోరుతుంటే, అసలుకే ఎసరు పెట్టి బీసీ రిజర్వేషన్లలో బీసీ(ఈ) కేటగిరిని కలిపి మరింత నష్టం చేకూరుస్తున్నదని ఆరోపించారు.

తాము చేసే ఆందోళన ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఒకవేళ వారు ఆ విధంగా అనుకొని మాకు ఓట్లు వేయకున్నా పరవాలేదన్నారు. బీసీ సంఘాలన్ని ఐక్యంగా ముందుకు సాగి బీసీ రిజర్వేషన్లలో ‘ఈ’ కేటగిరి చెందిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు రామకృష్ణ అధ్యక్షతన బీసీ సంఘాల ఐక్య వేదికను ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు యెండెల లక్ష్మీనారాయణ, కే లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే దేశిని చిన మల్లయ్య, రజక సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భిక్షపతి, బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు రామకృష్ణయ్యసహా 72 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సులో గుజరాత్ సీఎం నరేంవూదమోడీ చిత్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.