బీసీలు రాజ్యాధికార సాధనకు ఉద్యమించాలి

బీసీలు రాజ్యాధికారం సాధించినప్పుడే మరింత అభివృద్ధి చెందుతారని టీఆర్‌సీ ఆధ్వర్యంలో ‘బీసీలకు సబ్‌ప్లాన్ పరిష్కార మార్గాలు’ అనే అంశంపై శనివారం హైదరాబాద్‌లో జరిగిన చర్చా వేదికలో వక్తలు అభివూపాయపడ్డారు. గత 65 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర బడ్జెట్లన్నీ బీసీల సమస్యలకు పరిష్కారాలు చూపడంలో విఫలమైన నేపథ్యంలో బీసీ సబ్‌ప్లాన్ ప్రతిపాదన ముందుకు వచ్చిందని వారన్నారు. ఇది అమలు జరిగితే విద్య, వైద్యం, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలు ఎదుగుతారని అభివూపాయపడ్డారు. ఫ్రొఫెసర్లు కె. మురళి మనోహర్, పీఎల్ విశ్వేశ్వర రావు, అడప సత్యనారాయణ,సామాజిక వేత్త ఊ. సాంబ శివరావు, డాక్టర్ వినయ్ కుమార్, రాష్ట్ర హైకోర్టు న్యాయ వాది కె. కొండల్ రావు మాట్లాడారు. టీఆర్‌సీ చైర్మన్ ఎం. వేదకుమార్, కో ఆర్డినేటర్ బోనకుర్తి సోమేశ్వర్, జర్నలిస్టు పల్లె రవి కుమార్ పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.