బీసీలు ఏం పాపం చేశారు- బీజేపీ, సీపీఐ

బీసీలు ఏం పాపం చేశారు.  90కి   పైగా ఉప కులాలున్న బీసీలకు కేవలం 2 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తరా?  బీసీ కార్పొరేషన్ కు 20 వేల కోట్లు  అవసరమని నివేదికలుంటే కేవలం 2 వేల కోట్లు కేటాయించడమేంటని బీజేపీ   ఎల్పీ నేత డా.లక్ష్మణ్ ప్రశ్నించిన్రు. బీసీలకు బడ్జెట్ లో రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ అన్నరు. 51 శాతం ఉన్న  బీసీలకు కేటాయింపులు పెంచాలని ఆయన సూచించిన్రు.
బీసీల్లో డెక్కలి, ఒడ్డెర, నాయిబ్రాహ్మిణ్స్, రజకులు,  దొమ్మరి,  కాటిపాపల, పిచ్చిగుంట్ల తదితర కులాల వాళ్లు ఉన్నరని వారికెందుకు కల్యాణ లక్ష్మి వర్తింపజేయరని లక్ష్మణ్ ప్రశ్నించిన్రు. బీసీ ఏ, బీ, సీ, డీ కులాల్లో ఇప్పటికీ తిండిలేక అల్లాడుతున్నవారున్నారని గుర్తుచేసిన్రు. (ఈబీసీ) ఎకనామికల్లీ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కింద ఓసీల్లోని పేదలకు కూడా కల్యాణ లక్ష్మి అమలు చేయాలని లక్ష్మణ్ కోరిన్రు.

This entry was posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories.

Comments are closed.