బీసీలపై పక్షపాత ధోరణి

ఆదిలాబాద్ : ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన ప్రాధాన్యత బీసీలకు ఇవ్వకుండా ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంభిస్తోందని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కూలే ఆవేధన వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆదిలాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో ఈనెల 11న బీసీ సంక్షేమ శాఖ ప్రాంగణంలో మహాత్మజ్యోతిరావ్ ఫూలే, సావివూతిబాయి ఫూలే విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011లో పూలే విగ్రహానికి 4 లక్షల 10 వేలు మంజూరైనప్పటికీ, ఇప్పటి వరకు సంబంధిత అదికారులు స్థలాన్ని చూపలేదని ఆరోపించారు. జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విగ్రహావిష్కరణ కార్యక్షికమాన్ని చేపట్టినట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దారట్ల కిష్టు తెలిపారు. బీసీ సంఘం నాయకులంతా కలిసి చందాలతో బీసీ సంక్షేమశాఖ ప్రాంగణంలో విగ్రహావిష్కరణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.