బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎట్టకేలకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అద్యక్షుడు జీ కిషన్‌డ్డి సోమవారం ప్రకటించారు. కిషన్‌డ్డి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం రెండు నెలలు కష్టపడి..ఈ కార్యవర్గాన్ని రూపొందించారు. ఈ జాబితాలో మొత్తం 157 మందికి స్థానం కల్పించారు. ప్రాంతాలు, సామాజిక వర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలోనే తెలంగాణ ఉద్యమ కమిటీ ప్రకటించిన పార్టీ, ఈసారి కొత్తగా సీమాంధ్ర ఉద్యమ కమిటీని ఏర్పాటు చేసింది.శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్, వీ రామారావు, సీహెచ్ విద్యాసాగరరావు, ఇంద్రసేనాడ్డి, బద్దం బాల్‌డ్డి, ఆలె నరేంద్ర, జంగాడ్డి, చలపతిరావు, రాంచంవూదాడ్డి మేచినేని కిషన్‌రావు సహా మరో ఐదుగురిని ఎంపిక చేశారు.పార్టీ రాష్ట్ర కార్యాలయ కో ఆర్డినేటర్‌గా దాసరి మల్లేశం, కార్యవర్గ సభ్యులుగా 91 మందిని నియమించారు.కమిటీ మూడేళ్లు బాధ్యతలు నిర్వహిస్తుంది.

నలుగురు ప్రధాన కార్యదర్శులు: టీ ఆచారీ, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్(తెలంగాణ), జమ్ముల శ్యాంకిషోర్, ఎస్ సురేష్‌డ్డి(సీమాంధ్ర). 10 మంది ఉపాధ్యక్షులు: చింతా సాంబమూర్తి, జీ రామకృష్ణాడ్డి, కే సత్యనారాయణ, బండారు రంగమోహన్, ఎస్ మల్లాడ్డి, జీ ప్రేమేందర్ రెడ్డి, కే కపిలేశ్వరయ్య, కే ఉమ, ఎం అరుణాజ్యోతి, బీ వనిత.

10 మంది కార్యదర్శులు: అయ్యాజీ వేమ, కాసం వెంక రావు పద్మ, డీ ప్రదీప్ కుమార్, పీ వేణుగోపాలం, కే కోటేశ్వరరావు గౌడ్, సీహెచ్ మహాలక్ష్మీ, బీ మీనా కుమారి, కృష్ణావేణి నాయక్, కే విజయలక్ష్మీ. కాగా, ట్రెజరర్‌గా మనోహర్‌డ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా రవీంవూదరాజు, మంత్రి శ్రీనివాస్, అధికార ప్రతినిధులుగా రామచంవూదారావు, భాను ప్రకాష్, ఎస్ కుమార్, అంజనేయ రెడ్డి, పాకా సత్యనారాయణ, ప్రకాశ్‌డ్డి, వెంకట రమణిని నియమించారు. భారతీయ యువమోర్చ అధ్యక్షుడిగా ఎస్ విష్ణువర్థన్ రెడ్డి, మహిళా మోర్చా అద్యక్షురాలిగా..మాలతీరాణి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కే రాములు, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా గోలి మధుసూదన్ రెడ్డి, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా హనీఫ్ అలీని ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమ కమిటీ ఛైర్మన్‌గా టీ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్లుగా నాగురావు నామాజీ, అశోక్‌కుమార్ యాదవ్, నాగపూర్ రాజమౌళి, శ్రీరాం, కన్వీనర్‌గా శ్రీనివాస్, అధికార ప్రతినిధిగా వేణుగోపాల్‌డ్డి, ఐదుగురు జాయింట్ కన్వీనర్లను నియమించారు. సీమాంధ్ర ఉద్యమ కమిటీ చైర్మన్‌గా వై రఘునాథ్‌బాబు, వైస్ చైర్మన్లుగా హరినాథ్‌డ్డి, మాణిక్యాలరావు, కన్వీనర్‌గా వీ శ్రీనివాసరాజు, అధికార ప్రతినిధిగా జూపూడి రంగరాజు, ముగ్గురు జాయింట్ కన్వీనర్లను నియమించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.