బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మోడీ

పనాజీ: బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్‌గా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నియమితులయ్యారు. ఈ మేరకు గోవా రాజధాని పనాజీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నరేంద్ర మోడీ పేరును ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 2014 సార్వత్రిక ఎన్నికల కమిటీకి మోడీ నాయకత్వం వహించనున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.