హైదరాబాద్: బీజేపీ జాతీయనేత బంగారు లక్ష్మణ్ కన్నుమూశారు. కొంత కాలంగా శ్వాసకోశ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని యశోధా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. లక్ష్మణ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1939 మార్చి 17న ఆయన జన్మించారు. హైదరాబాద్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1975లో ఎమర్జెన్సీ కాలంలో జైలు కెళ్లారు. 1996లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2000-2001 మధ్య ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ ప్రభుత్వంలో 1999-2000ల మధ్య రైల్వే శాఖ సహాయం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రక్షణ రంగం కుంభకోణం కేసులో కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. తెహల్కా జర్నలిస్టులు నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో ఆయన ముడుపులు స్వీకరిస్తూ దొరికిపోయారు.
బీజేపీ జాతీయనేత బంగారు లక్ష్మన్ కన్నుమూత
Posted on March 1, 2014
This entry was posted in TELANGANA NEWS, Top Stories.