బీజేపీ కష్టాలే.. కాంగ్రెస్‌కు వరాలు

-అవినీతి, యడ్యూరప్ప.. లింగాయత్‌లు..
– కాంగ్రెస్ గెలుపులో కీలక భూమికలు
– 11 జిల్లాల్లో బీజేపీని తుడిచిపెట్టిన కాంగ్రెస్
– పట్టణ ప్రాంతాల్లోనూ జైత్రయాత్ర
కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న సామెత కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి నూటికి నూరుపాళ్లూ సరిపోలుతుంది. ఏడేళ్ల తర్వాత కన్నడనాట అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్‌కు.. సొంత శక్తియుక్తులకంటే ప్రత్యర్థుల బలహీనతలు, వారి మధ్య కొట్లాటలే ఎక్కువ మేలు చేశాయి. గత 35 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో జరిగిన 71% పోలింగ్‌కూడా కాంగ్రెస్‌ఆశలను సజీవంగా ఉంచింది. అత్యధిక స్థాయిలో పోలింగ్ అంటే అధికార పార్టీకి ప్రతికూలత వ్యక్తం కావడమేనన్న అభివూపాయం ఉంది. నిజానికి అవినీతి విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పెద్ద తేడా లేదన్న అభివూపాయం ఉంది. కర్ణాటక పీఠం కోసం పోటీపడిన కాంగ్రెస్, బీజేపీల్లో మొదటి పార్టీ జాతీయ స్థాయిలో అవినీతి ఆరోపణల్లో కూరుకుని ఉంది. బీజేపీ అవినీతి ఏ స్థాయిలో ఉందో కర్ణాటక ప్రజలు స్వయంగా చూశారు.

ఈ నేపథ్యంలో సమీప అవినీతి ప్రత్యర్థిని కర్ణాటక జనం ఓడించారని భావించాలేమో! మరోవైపు రాష్ట్ర జనాభాలో 18శాతంతో బలమైనవర్గంగా ఉన్న లింగాయత్‌లు యడ్యూరప్ప పుణ్యమాని బీజేపీకి మొండి చేయి చూపించడంతోపాటు.. కాంగ్రెస్‌కు అనుకూలంగా స్పందించడం ఆటను మార్చివేసింది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేజిక్కించుకోవడం కాంగ్రెస్‌కు కష్టమైన పనేమీకాలేదు. తద్వారా 1999 నాటికి పూర్వం ఉన్న స్థితికి కాంగ్రెస్ సులభంగానే చేరుకుంది. బీజేపీకి ఒకప్పుడు పెట్టని కోటలుగా ఉన్న ప్రాంతాల్లో భారీ విజయాలు నమోదు చేసిన కాంగ్రెస్.. కోస్తా కర్ణాటక ప్రాంతంలో బీజేపీని పూర్తిగా తుడిచిపె 11 జిల్లాల్లో బీజేపీకి రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా చేసింది. ముంబై-కర్ణాటక, హైదరాబాద్-కర్ణాటక, మధ్య కర్ణాటకల్లోసైతం కాంగ్రెస్ జైత్రయాత్ర సాగింది. మోడీ ఎలాంటి ప్రభావం చూపించకపోవడం కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. పైగా ఆయనపై ఉన్న వ్యతిరేకత ఓట్ల రూపంలో కాంగ్రెస్‌కు లాభించింది. పలు పట్టణ ప్రాంతాల్లో సైతంకాంక్షిగెస్ పట్టుసాధించింది. ఫలితంగా ఉడిపి, మంగళూరు, కర్వార్, షిమోగ, హుబ్లి-ధార్వాడ్, బెల్గాం, హవేరి, దావణగేరె, టుముకూర్, మైసూర్ ప్రాంతాల్లో బీజేపీని తుడిపెట్టింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.