బీజేపీ ఉపాధ్యక్షుడిగా దత్తాత్రేయ

 

bandaru -కేరళ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగింత
-తమిళనాడు ఇన్‌చార్జిగా మురళీధర్‌రావు, పుదుచ్చేరికి లక్ష్మణ్
-ఆంవూధవూపదేశ్ ఇన్‌చార్జిగా ప్రభాత్ ఝా
-మోడీ అనుచరుడు అమిత్‌షాకు యూపీ..
-వరుణ్‌గాంధీకి బెంగాల్ బాధ్యతలు అప్పగింత
బీజేపీ రాష్ట్ర నేతలకు జాతీయ స్థాయిలో మరింత ప్రాముఖ్యం లభించింది. సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అలాగే ఆయనకు పార్టీ కేరళ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. దత్తాత్రేయ అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో కేంద్రమంవూతిగా పనిచేసిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర నేతలు పీ మురళీధరరావు, డాక్టర్ కే లక్ష్మణ్‌లను వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జులుగా నియమించారు. మురళీధరరావుకు తమిళనాడు ఇన్‌చార్జి బాధ్యతలతోపాటు బీజేపీ యువమోర్చా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న డాక్టర్ కే లక్ష్మణ్‌ను గతంలో మాదిరిగానే పాండిచ్చేరి ఇన్‌చార్జిగా నియమించారు. మరోవైపు ఆంధ్రవూపదేశ్ ఇన్‌చార్జిగా ప్రభాత్ ఝాను నియమించారు. గతంలో రాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్న పురుషోత్తం రూపాలను బీజేపీ కిసాన్‌మోర్చా బాధ్యతలు అప్పగించారు.

కాగా, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంవూదమోడీకి అత్యంత సన్నిహితుడు అమిత్‌షాకు కమలంలో కీలక పదవి లభించింది. రాజకీయంగా కీలకమైన ఉత్తరవూపదేశ్ పార్టీ వ్యవహారాల బాధ్యతలను అమిత్ షాకు కట్టబెట్టారు. అదేసమయంలో యూపీకి చెందిన యువనేత వరుణ్‌గాంధీకి పశ్చిమ బెంగాల్ పార్టీ బాధ్యతలు ఇచ్చారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జులు, కన్వీనర్ల పేర్లతో కూడిన జాబితాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం విడుదల చేశారు.

రానున్న ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చేపట్టాలంటే.. 80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌పై పట్టు సాధించడం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో వ్యవస్థాగత విషయాల్లో బాగా పట్టున్న అమిత్‌షాకు యూపీలో పార్టీ బాధ్యతలు అప్పగించారు. మరో నాయకుడు అనంత్‌కుమార్‌ను బీహార్ నుంచి తప్పించి.. త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యవూపదేశ్‌కు పార్టీ ఇన్‌చార్జీగా బదిలీ చేశారు. అలాగే త్వరలో ఎన్నికలు జరుగనున్న ఛత్తీస్‌గఢ్‌కు రాజ్యసభ సభ్యుడు జేపీ నందను ఇన్‌చార్జిగా నియమించారు. మహారాష్ట్ర ఇన్‌చార్జిగా రాజీవ్‌ప్రతాప్ రూఢీని, జార్ఖండ్ ఇన్‌చార్జిగా రమాపతి రామ్‌త్రిపాఠిని, గోవా ఇన్‌చార్జిగా స్మృతి ఇరానీని నియమించారు. రాజస్థాన్‌కు కొత్త ఇన్‌చార్జిగా కెప్టెన్ సింగ్‌ను నియమించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.