బీజేపీ అమ్ములపొదలో నాగాస్త్రం

(బైరగోని శ్రీనివాస్) కాషాయ దళానికి కొత్త కాంతి రానున్నది. బీజేపీ అమ్ములపొదకు నాగాస్ర్తం తోడవుతున్నది. సమైక్య టీడీపీని ఆగం చేసిన నాగం జనార్దన్ రెడ్డి పట్ల బీజేపీ ఢిల్లీ పెద్దలు సానుకూలంగా ఉన్నరు. జమానల కూడా నాగంతో బీజేపీ నేతలు
చర్చలు జరిపిన్రు. కానీ నాగం అప్పుడు ఇంట్రస్ట్ చూపలేదు. సోమవారం కిసన్ రెడ్డి, దత్తాత్రేయ నాగంతో రెండుగంటలు మాట్లాడిన్రు. నాగం కూడా కాషాయం కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిగ్నల్ ఇచ్చిన్రట. నాగం వైఎస్సార్ సీపీలోకి వెళ్తారని ప్రచారం జరగడంతో ఆయన పొలిటికల్ కెరీర్ అయిపోయిందని ప్రచారం జరిగింది. నిజంగా కూడా తెలంగాణ నుంచి జగన్ పార్టీలో చేరినవారికి, చేరాలనుకుంటున్నవారి రాజకీయ భవిష్యత్ సర్వనాశనమేనని సర్వేలు చెప్తున్నయి. సో రెడ్డి నేతలు తోకలు కలిశాయని తొందరపడొద్దు. సమైక్య జగన్ కు బాకా కొట్టడానికి రెడీ కావొద్దు. మొన్ననే జిట్టా బాలక్రిష్ణారెడ్డి జగన్ పార్టీలో చేరి తెలంగాణవాదులకు చులకనైపోయిండు. ప్రజల్లో పలచనైపోయిండు. పరకాల నియోజకవర్గంలో ఇంటిటికి అభిమానులను సంపాదించుకున్న కొండా సురేఖే తెలంగాణవాదం ముందు ఓడిపోయింది. జగన్ ను నమ్ముకుని నట్టేట మునిగింది.

తెలంగాణలో అత్యంత ఆదరణ ఉన్న పార్టీ టీఆర్ ఎస్. ప్రజల్లో నమ్మకమున్న పార్టీ టీఆర్ ఎస్.  తర్వాతి స్థానంలో ఉన్నది బీజేపీ. గులాబీ నేతల పోరాటానికి ఆకర్షితుడై, కేసీఆర్ అసాధారణ సామర్థ్యాన్ని నమ్మి హరీశ్వర్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరుతున్నరు.  ఇక నాగం పైన చెప్పినట్టు బీజేపీలో చేరుతున్నరు. ఈ రెండు పార్టీలే మనవి. తెలంగాణ పుట్టిన ఎవరైనా ఈ రెండు పార్టీల్లో ఒకదాన్ని ఎంచుకోవాలే తప్ప.. సమైక్య పార్టీల కండువాలను కప్పుకోవద్దు. అయితే గులాబీ దళం. కాదంటే కాషాయ దళం. మనకొద్దీ ఫాల్త్ ఫ్యాన్ పార్టీ.
ఆ సమైక్య గాలిని తెలంగాణ పొలిమేరలకు రానివ్వొద్దు. జై తెలంగాణ.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.