బీజేపీలో మోడీ శకం

modi -ఎన్నికల ప్రచార కమిటీ పగ్గాలు అప్పగింత
-మోడీ ఎంపికతో అద్వానీకి ఎదురుదెబ్బ.. చివరివరకూ నిరోధించిన అగ్రనేత!
-ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో మోడీకే బాధ్యతలు

– మోడీ ఎన్నిక ఏకగ్రీవం ఇది బీజేపీ విజయానికి బాట : రాజ్‌నాథ్
– జనం విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్
– దేశం నుంచి ఆ పార్టీని తరిమేయాలి
– వాజపేయి ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయాలి
– కొత్త బాధ్యతల స్వీకరణ అనంతరం మోడీ

తీవ్ర ఉత్కంఠ.. తర్జనభర్జనలు.. వ్యతిరేకతల నడుమ బీజేపీ జాతీయ ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు గుజరాత్ సీఎం నరేంవూదమోడీకి దక్కాయి. పార్టీలో వాజపేయి తర్వాత కురువృద్ధ నేతగా ఉన్న అద్వానీ తీవ్రంగా వ్యతిరేకించినా.. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు, అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ బాసట తోడవడంతో ప్రతికూల పరిస్థితులను మోడీ సునాయాసంగానే అధిగమించగలిగారు.

మోడీని జాతీయ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా నియమించినట్లు రాజ్‌నాథ్‌సింగ్ గోవాలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు అనంతరం విలేకరులకు వెల్లడించారు. మోడీ ఎంపిక.. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయానికి బాటగా అభివర్ణించారు. ఇది ఏకక్షిగీవ ఎన్నికని చెప్పిన రాజ్‌నాథ్.. మరిన్ని వివరాలు వెల్లడించకుండానే వెళ్లిపోయారు. రెండు రోజుల సమావేశానికి అనారోగ్య కారణాలు చూపి అద్వానీ డుమ్మా కొట్టడం ద్వారా మోడీ ఎన్నికను నిరోధించేందుకు ప్రయత్నించినా.. రాజ్‌నాథ్ వర్గీయులే పై చేయి సాధించినట్లు అర్థమవుతోంది. ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు మోడీకి దక్కడంతో అద్వానీకి బీజేపీలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన అనంతరం 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడిన మోడీ.. రాజ్‌నాథ్‌ది పెద్దమనసని చెప్పారు. తనకు ఇంతటి బాధ్యతను, గౌరవాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌పై ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధించిన గుజరాత్ సీఎం.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఆ పార్టీని దేశం నుంచి తరిమివేయాలని, కాంగ్రెస్ నుంచి భారత్‌ను విముక్తి చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

వాజపేయి ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేసేందుకు బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజ్యాంగంలోని 356వ అధికరణాన్ని కాంగ్రెస్ గతంలో అనేకసార్లు దుర్వినియోగం చేసిందని మోడీ ఆరోపించారు. రాజ్‌భవన్‌లు కాంగ్రెస్ భవన్‌లుగా మారాయని విమర్శించారు. ఇప్పుడు ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు కాంగ్రెస్‌వారు సీబీఐని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. జాతీయ సలహా మండలిలోనే కాదు.. ప్రణాళికా సంఘంలోనూ నక్సల్స్‌తో ములాఖత్ అయినట్లు ఆరోపణలు ఉన్న వ్యక్తి ఉన్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్‌గా మోడీ పేరును ప్రకటించగానే.. సమావేశంలో దాదాపు ఐదు నిమిషాలు ఆగకుండా మోగిన చప్పట్లు.. ఇక బీజేపీలో మోడీ శకం ప్రారంభమైందనడానికి, అద్వానీ శకం ముగిసిందనడానికి సంకేతాలని విశ్లేషకులు అంటున్నారు.

మోడీతో అధికారం.. అధికారంతో తెలంగాణ
ప్రత్యేక రాష్ట్రం వచ్చేస్తుందంటున్న బీజేపీ టీ నేతలు
హైదరాబాద్, జూన్ 9 (టీ మీడియా): గుజరాత్ ముఖ్యమంత్రి నరేంవూదమోడీని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఎన్నుకోవడంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మోడీ రాకతో తమ పార్టీ విజయావకాశాలు మెరుగయ్యాయని, ఫలితంగా బీజేపీ అధికారంలోకి వచ్చి, తెలంగాణ ఇవ్వడం ఖాయమైందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మోడీని ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్‌గా ఎంపిక చేయడం మంచి పరిణామంగా బీజేపీ నేతలు ప్రచారం చేయనున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే 100రోజుల్లో తెలంగాణ ఇస్తామని గతంలో ఆపార్టీ అధినేతగా ఎల్‌కే అద్వానీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ గుజరాత్ అభివృద్ధి చెందుతున్నదని, ముఖ్యంగా విద్యుత్ సంక్షోభం రాకుండా తీసుకుంటున్న చర్యలు, వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రాధాన్యం వంటి అంశాలు నరేంవూదమోడీ చేసే ప్రచారానికి ఓట్ల రూపంలో ప్రతిఫలం ఇవ్వనున్నాయని అంటున్నారు. గుజరాత్ అభివృద్ధిపైనే కాకుండా ఆంధ్రవూపదేశ్‌పైనా మోడీ దృష్టి సారించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా మోడీని ఇక్కడి బీజేపీ నేతలు కొనియాడుతున్నారు. మోడీ బీసీ నేత అయినందున ఈ అంశాన్ని కూడా ప్రచారం అస్త్రంగా వాడుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు సీనియర్లు చెబుతున్నారు.

27న నగరానికి మోడీ?
– తెలంగాణ పోరుసభకు రప్పించాలని బీజేపీ యోచన
– మోడీ ఎంపికపై రాష్ట్రంలో శ్రేణుల సంబురాలు
బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఎంపికైన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంవూదమోడీ ఈ నెల 27న హైదరాబాద్‌కు వస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లో నిర్వహించే విద్యార్థి సదస్సులో మోడీ పాల్గొంటారని సమాచారం. గోవాలో ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సులో పాల్గొన్న పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌డ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తావూతేయ, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగరరావు, డాక్టర్ కే లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనాడ్డి, డాక్టర్ కే హరిబాబు.. ఎన్నికల కమిటీ చైర్మన్‌గా నియమితులైన మోడీని అభినందించారు. రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఇందుకు గతంలోనే అంగీకారం తెలిపిన మోడీ, ఈ నెల 27న హైదరాబాద్‌కు వస్తానని చెప్పినట్టు తెలిసింది. ఏమైనా అనుకోని పరిస్థితులు ఏర్పడితేతప్ప హైదరాబాద్ పర్యటనలో మార్పు ఉండదని పార్టీ వర్గాలు తెలిపాయి. నరేంవూదమోడీ అంటే రాష్ట్రంలోనూ ప్రజాదరణ ఉందని, యువతలో క్రేజ్ మరింత ఎక్కువగా ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే విద్యార్థి సదస్సుకు నరేంవూదమోడీ వచ్చినట్టయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మరింత ప్రయోజనం కలుగుతుందని వారు భావిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం కారణంగా ఈ ప్రాంతంలో బలపడ్డామని బీజేపీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. తెలంగాణ విషయంలో జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ అంశంపై ఈ ప్రాంత ప్రజలకు మరింత నమ్మకం కలిగించేందుకు తెలంగాణ జిల్లాల్లో నిర్వహించే పోరుసభల్లో ఏదైనా ఒక సభకు నరేంవూదమోడీని కూడా రప్పించాలని యోచిస్తున్నామని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మోడీ పోరుసభలో పాల్గొని తెలంగాణ అంశంపై ప్రకటిస్తే.. ఈ ప్రాంత ప్రజలకు పార్టీ పట్ల మరింత విశ్వాసం చేకూరుతుందని, తద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందుతామని ఆయన తెలిపారు. అదే విధంగా సీమాంవూధలో కూడా మోడీతో యువజన సదస్సు నిర్వహిస్తామని ఆ ప్రాంతానికి చెందిన ఒక నేత తెలిపారు. మోడీని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించడంతో బీజేపీ రాష్ట్ర కమిటీ హర్షం ప్రకటించింది. ఈ సందర్బంగా పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. రంగులు చల్లుకుంటు మిఠాయిలు పంచారు. కార్యక్షికమంలో పార్టీ నేతలు ఎస్ ప్రకాశ్‌డ్డి, దాసరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.