బీజేపీలోకి నాగం!

 

nagam
– ఢిల్లీలో రాజ్‌నాథ్‌తో భేటీ
– మహబూబ్‌నగర్ ఎంపీ సీటుపై హామీ!
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరడానికి తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌డ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌డ్డితో కలసి ఆయన బుధవారం రాత్రి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం టికెట్‌పై రాజ్‌నాథ్‌సింగ్ నుంచి నాగం స్పష్టమైన హామీ పొందినట్టు తెలిసింది. మీ సమక్షంలోనే పార్టీలో చేరుతానని రాజ్‌నాథ్‌కు తెలిపిన నాగం అందుకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాన్ని వేదికగా చేసుకుంటారని సమాచారం. కర్ణాటక ఎన్నికలు ముగిసిన అనంతరం హైదరాబాద్‌లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న నరేంవూదమోడీతో బహిరంగసభ నిర్వహించే అవకాశాలు ఉండడంతో, జూన్‌లో మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి.. రాజ్‌నాథ్ సమక్షంలో నాగం పార్టీలో చేరుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

‘బీజేపీ’తోనే తెలంగాణ సాధ్యం: నాగం
బీజేపీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని నాగం జనార్దనడ్డి తెలిపారు. గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌డ్డితో కలిసి నాగం జనార్దనడ్డి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను ఢిల్లీలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీపై తనకు నమ్మకం ఉందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఎజెండాలో తెలంగాణ అంశాన్ని చేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్రం వైఖరి చూస్తుంటే.. పార్లమెంట్‌పైనే నమ్మకం పోతున్నదన్నారు. మన్మోహన్‌సింగ్ పేరుకు మాత్రమే ప్రధాని అని, పెత్తనమంతా.. సోనియాగాంధీదేనని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తేనే తెలంగాణ వస్తుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రవాదులందరూ బీజేపీకే ఓటు వేసి మద్దతు పలకాలని కోరారు. బీజేపీలో చేరుతున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..‘‘ ఏ పార్టీలో చేరాలనేదానిపై నిర్ణయం తీసుకోవడానికి సమయం ఉంది’’ అని బదులిచ్చారు. బీజేపీలో చేరబోనని తాను చెప్పడం లేదని, తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వివరించారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీ తరఫున పోటీ చేస్తానని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.