బీజేపీకి మార్గదర్శకుడు అద్వానీ: రాజ్‌నాథ్‌సింగ్

దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య బీజేపీని నడిపించడానికి సీనియర్ నేత అద్వానీ వైపు చూస్తున్నట్లు అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీపై ఆరోపణలు అవాస్తవమని, కల్పితమని చెప్పారు. శనివారం ఆయన పార్టీ జాతీయ మండలి సమావేశంలో ప్రసంగిస్తూ అద్వానీ, గడ్కరీల ప్రస్తావన తెచ్చారు. ‘‘మమ్మల్ని నడిపించే మార్గదర్శకుడెవరైనా ఉన్నారంటే ఆయన అద్వానీయే. దేశం క్లిష్టమైన దశలో వెళుతున్నప్పటికీ మేము వగచాల్సిన పనిలేదు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. కానీ అద్వానీ మార్గదర్శకత్వంలో బీజేపీ ఈ సమస్యలను అధిగమిస్తుంది’’ అని ఆయన అన్నారు. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధ్యక్ష పదవిని చేపట్టరాదని గడ్కరీ నిర్ణయించుకున్నారని, దాంతో తాను అధ్యక్షుడినయ్యానని రాజ్‌నాథ్ చెప్పారు. ఆయనపై ఆరోపణలన్నీ నిరాధారమైనవని అన్నారు. బాధపడాల్సిన పనిలేదని చెప్పానని, యావద్దేశం ఆయన వెంట ఉన్నదని అన్నారు. ఆయన వల్ల పార్టీ బలపడిందని చెప్పారు

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.