బిల్లులో సవరణలపై స్పీకర్‌కు టీ ఎమ్మెల్యేల లేఖ

హైదరాబాద్: టీ ముసాయిదా బిల్లులో తెలంగాణకు భారంగా పరిణమించబోతున్న క్లాజ్‌లపై టీ ఎమ్మెల్యేలు సవరణలు సూచిస్తూ స్పీకర్‌కు లేఖ రాశారు. బిల్లుపై రాతపూర్వక సవరణలకు స్పీకర్ ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సవరణలు సూచిస్తూ లేఖలో పేర్కొన్నారు.లేఖలో గవర్నర్ పాలన రాజ్యాంగం ప్రకారం జరగాలని 8వ క్లాజ్ సవరణకు ప్రతిపాదన. ముసాయిదా బిల్లులో 9 క్లాజుల సవరణలపై ప్రతిపాదన.

స్థానికత ఆధారంగానే ఉద్యోగులు, సెన్షనర్ల విభజన చేయాలని సవరణకు ప్రతిపాదన. రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు ఉండాలని 30 నుంచి 43 వరకు క్లాజ్‌ల సవరణకు ప్రతిపాదన. తెలంగాణ ఎయిమ్స్, వెటర్నరీ యూనివర్సిటీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సవరణ ప్రతిపాదన. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఆస్తులు, అప్పుల పంపకం ఏవిధంగా అయితే జరిగిందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరగాలని కోరారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.