బిల్లును తిప్పి పంపాలనడమేంటి?: నాగం

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు మరింత సమయం కావాలని కోరిన ముఖ్యమంత్రి, ఇప్పుడు బిల్లు తప్పుల తడకగా ఉందని, తిప్పిపంపాలని కోరడమేమిటని బీజేపీ నేత, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో శనివా రం ఆయన మీడియాతో మాట్లాడారు. బిల్లును తిప్పి పంపే అంశంపై నోటీస్ ఇచ్చిన ముఖ్యమంత్రి, ఈ అంశంలో తెలంగాణ మంత్రులను సంప్రదించారా? కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారా? అని నిలదీశారు. ప్రభుత్వమే తీర్మానం ఆమోదించినట్టుగా వ్యవహరిస్తున్న ము ఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని తెలంగాణ మంత్రులు గవర్నర్‌ను కోరాలని సూచించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.