బిల్లుకు అమరుల రక్తం అంటుకొని ఉంది:ఈటెల

హిందువులకు భగవద్గీత, ముస్లీంలకు ఖురాన్ , క్రైస్తవులకు బైబిల్ ఎలాగో మాకు తెలంగాణ బిల్లు అంత పవిత్రమైందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. అటువంటి బిల్లును సీమాంధ్ర నేతలు మీడియా సాక్షిగా చించివేసి, తగలబెట్టడం మమ్మల్ని ఎంతో బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లుకు అమరుల రక్తం అంటుకొని ఉందని దాన్ని అవమానపరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఈటెల రాజేందర్ తెలిపారు. ఒళ్లంతా కాలుతుంటే జై తెలంగాణ అంటూ అమరులు కళ్లు మూసిన్రని పేర్కొన్నారు.

కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ పది క్లాజులపై టీఆర్‌ఎస్ సవరణలు సమర్పించిందని పేర్కొన్నారు. చిన్నరాష్ట్రాల ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికే ఉంటుందని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు.

నలుగురు ప్రధానమంత్రులు, 29 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చినాయని చెప్పారు. సీమాంధ్రులు ఎంత ఇంగ్లీషులో మాట్లాడినా వచ్చే రాష్ట్ర ఆగదని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే సీఎం కట్టుబడి ఉంటానని చెప్పిండని గుర్తు చేశారు.
ఇచ్చే శక్తీ లేదు.. ఆపే శక్తీ తమకు లేదని తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తామని జగన్ ప్లీనరీలో చెప్పలేదా అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకారం కాబోతుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో విభజన ఏర్పాటు తీరుపై ఈటెల స్పందిస్తూ తెలంగాణ ముసాయిదా బిల్లుపై సభ్యుల అభిప్రాయాలు కోరినందుకుగాను స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మూడు తరాల ఉద్యమ ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. అన్నదమ్ముల్లా విడిపోదాం. ఆత్మీయుల్లా కలిసుందామని సీమాంధ్రు నేతలకు సూచించారు. ఆంధ్రప్రాంతంలో కూడా అనేక వర్గాలు విభజన కోరుకుంటున్నాయన్నారు. రాజకీయ పార్టీలే గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. 50 ఏళ్ల కాలం నుంచి మమ్మల్ని మనుషులుగా గుర్తించలేదన్నారు. పాలకులెవ్వరూ తెలంగాణ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదన్నారు. ప్రజా ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని తెలిపారు.

మా భూములమ్మి మాకు నిధులు ఇవ్వలేదు’

హైదరాబాద్: తెలంగాణ భూములు అమ్ముకున్న డబ్బులో కనీసం 10 శాతం కూడా ఖర్చు చేయలని ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు.

శాసన సభలో ఆయన మాట్లాడుతూ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ దేశానికి తలమానికంగా ఉండేదని… కాని ఇప్పుడు దాన్ని అమ్ముకుని మా చెరుకు రైతులు పండిన పంటను తగలబెట్టుకుంటున్నరాని తెలిపారు. సింగరేణి ఉద్యోగులు సంఘటితంగా ఉండబట్టే దాన్ని పాలకులు అమ్మే సహాసం చేయలేదన్నారు. మాకు మేలు తలపెట్టి ఉంటే ఉద్యమాలు ఎందుకు వచ్చేవని ప్రశ్నించారు.

హైటెక్‌సిటీ పక్కన ఉన్న భూములను లక్షల కోట్లకు అమ్ముకోలేదా అని ప్రశ్నించారు. పార్కులను, చారిత్రక స్థలాలను కూడా వదిలిపెట్టకుండా అమ్ముకున్నరు… మా వారాసిగూడ, అడ్డగుట్టలో బతికే మా కార్మికులకు వంద గజాల జాగకూడా లేదని ఆరోపించారు. విలీనం సమయంలో హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టులో తెలంగాణ సీనియర్ జడ్జిలను ప్రమాణస్వీకారం చేయించలేదా అని ప్రశ్నించారు.

56 ఏళ్ల చరిత్రలో ఒక్క అడ్వకేట్ జనరల్ కూడా తెలంగాణ వారు లేరన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో, జిల్లా జడ్జీల నియామకంలో తెలంగాణవారు కనీసం 20 శాతం వరకు కూడా లేరని అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడామని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.