బాస్‌ కు బ్యాండేసిన ఐ న్యూస్ ఎంప్లాయిస్

 

 

అదేంటో ఒక పొజిషన్‌ రాగానే ప్రతోడు కింది ఉద్యోగులను ఓ ఎక్కేస్తుంటడు. వాళ్ల జేబుల్లోంచి జీతాలు ఇచ్చినట్టు కిందిస్థాయి ఉద్యోగులను పాలేర్లలాగా చూస్తరు.  ఈ బాస్‌కు జీతం ఇచ్చే యాజమాన్యమే కిందిస్థాయి ఉద్యోగులకు జీతం ఇస్తుంది. బాస్‌ అనేటోడు పెద్దపాలేరైతే.. కిందిస్థాయి ఉద్యోగులు చిన్నపాలేర్లు. ఇప్పుడున్నమీడియా అంతా బానిసకొకబానిసకొక బానిస బతుకులే. ఆ విషయాన్ని మరిచి ఇదిగో ఇలాంటి బాస్‌లు ఉచ్ఛనీచాలు మరిచి కిందిస్థాయి ఉద్యోగులను నోటికొచ్చినట్టు తిడుతున్నరు. ఐ న్యూస్‌ ఉద్యోగులు ఈ  బాస్ కు బ్యాండ్ వేసిన్రు. ఐ న్యూస్‌ చీఫ్‌ ఎడిటర్‌ కృష్ణమోహన్‌ బూతు పురాణాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. యూ ట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ ప్లస్‌లో వీడియో అప్‌లోడ్‌ చేసి ఇజ్జతితీసి గజ్జె కట్టిన్రు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న యాజమాన్యం కృష్ణమోహన్‌ను రిజైన్‌ చేయాల్సిందిగా ఆదేశించింది.  కింద పనిచేసేవాళ్లు ఏం చేస్తారులే అనుకుంటే బాస్‌ ఉద్యోగమే ఊడగొట్టించిన్రు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో కృష్ణమోహన్‌ వీడియో హల్‌చల్ చేస్తుంది.  ఫేస్‌బుక్‌లో అయితే షేరింగులే షేరింగులు.. నారో మెంటాల్టీతో తమ కింద పనిచేసేవారిపై నోరుపారేసుకుంటున్న బాస్‌లకు కృష్ణమోహన్‌ వీడియో  గుణపాఠం  అవుతోంది. గత 11 రోజులుగా కొన్ని చానళ్లలో బాస్‌లు పబ్లిక్‌గా బూతులు తిట్టడం మానేశారట. ఎవరైనా తమ బిహేవియర్‌ను రికార్డు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తే తమ పరువుపోతుందని  భయపడుతున్నరట. తప్పు చేస్తే క్లాస్‌ ఇవ్వడంలో తప్పులేదు. కానీ తప్పుడు మాటలు మాట్లాడితే ప్రాబ్లం.. కృష్ణమోహన్‌కు పట్టిన గతే మీకూ పడుతుంది. సో.. బివేర్‌ ఆఫ్‌ ఎంప్లాయిస్‌.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories, VIDEOS.

Comments are closed.