బాబు పాదయాత్రపై కేటీఆర్ ఫైర్

హైదరాబాద్: చంద్రబాబు పాదయాత్రపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ ఆయ్యారు. తెలంగాణపై మాట నిలబెట్టుకోకుండా అఖిలపక్షం అంటున్న చంద్రబాబుకు తెలంగాణలో భవిష్యత్ లేదని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న సీమాంధ్ర నాయకులను తెలంగాణ ప్రజలు అడ్డుకుంటే తప్పెంటని ప్రశ్నించారు. ఇచ్చిన మాట తప్పి నిస్సిగ్గుగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన టీడీపీకీ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.