‘బాబు, కిరణ్‌ల ఉద్దేశం తెలంగాణను అడ్డుకోవడమే’

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడులు సీమాంధ్ర ప్రజలకు సమస్యలు ఉన్నాయనడం సరికాదని, సమస్యలకు పరిష్కారం సూచించాలని టీఆర్‌ఎస్ నేత మాజీ ఎంపీ బి. వినోద్ ప్రశ్నించారు. ఆంధ్ర బాబులు ఉద్దేశం అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించడం కాదని తెలంగాణను అడ్డుకోవడమేనని విమర్శించారు. నీళ్లు, విద్యుత్, ఉద్యోగాలు, హైదరాబాద్ సమస్యలపై సీమాంధ్ర ప్రజలకు అవగాహన ఉందని వినోద్ చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు మూడు పార్టీల ఆధిపత్య పోరులో భాగంగా వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌లు కొట్టుకుంటున్నాయని తెలిపారు. సీఎం కిరణ్ ఎట్ల మాట్లాడిండో టీడీపీ అధ్యక్షుడు అట్లనే మాట్లాడిండని, సమస్యలున్నయని ముగ్గురు మాట్లాడుతున్నరని, ఎలాంటి సమస్యలు లేవని తెలంగాణవాదులు చెబుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిదని అంటున్నడు, హైదరాబాద్ కంటే బెంగళూరు, కోల్‌కతా, ముంబై, చెన్నైలు ఐటీ రంగంలో ముందున్నాయని చెప్పారు. ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్నప్పుడే బాబు సీఎంగా ఉన్నాడని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.