బాబు ఎందుకు కలిసిరాడు: కేటీఆర్

కాంగ్రెస్‌పై వీధుల్లో తొడలు కొడుతున్నా చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవిశ్వాసం పెడితే తమతో ఎందుకు కలిసిరావడంలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ‘మీది చిత్తూరు, మాది చిత్తూరు’ అనే ప్రాతిపదికన కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల అక్రమ సంబంధం ఇవాళ్టితో బయటపడిందని ఆయన అన్నారు. టీడీపీ చరిత్రలో ఇవాళ బ్లాక్‌డేగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్టీని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఆత్మ ఎంతో క్షోభిస్తుందని అన్నారు. టీడీపీ ఇక తెలుగు కాంగ్రెస్‌పార్టీ అని పేరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.