బాబుతో పొత్తు వద్దు : నాగం

ఢిల్లీ : తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పొత్తు వద్దని తమ పార్టీ జాతీయ నేతలతో చెప్పినట్లు బీజేపీ నేత నాగం జనార్ధన్‌రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికలో బీజేపీ వంటరిగానే పోటీ చేస్తోందని నాగం వెల్లడించారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 10 రోజుల్లో కేబినెట్ నోట్ పెట్టాలని నాగం డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇంకా తెలంగాణను తాత్సారం చేస్తే సహించేది లేదన్నారు. డ్రామాలు చేస్తున్న సీఎం కిరణ్ రాజీనామా చేయాలి లేదా బర్తరఫ్ చేయాలని నాగం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అసలు విభజన ప్రక్రియ ఆలస్యం జరుగుతుంటే ఎదో కుట్ర జరుగుతోందన్న అనుమానం వస్తుందన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.