బాంబు పేలుళ్ల కేసులో పురోగతి

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గంట నిడివి ఉన్న సీసీ టీవీ పుటేజ్ పోలీసులకు లభించింది. సీసీ టీవీ పుటేజ్‌ను ఎన్‌ఐఏ, పోలీసులు విశ్లేషిస్తున్నారు. పేలుడు ఘటనలో జార్ఖండ్, యూపీ, బీహార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులపై ఎన్‌ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. గత ఏడాది ఆగస్టు 21న పుణెలో బాంబు పేలుళ్లకు పాల్పడిన వ్యక్తే ఇక్కడ కూడా పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పుణె పేలుళ్లకు పాల్పడిన వ్యక్తి కోసం ఈ ఏడాది జనవరి 18న హైదరాబాద్‌లో ఓ లాడ్జిపై పోలీసులు దాడి జరిపారు. పోలీసుల దాడిని ముందే పసిగట్టిన ఆ వ్యక్తి లాడ్జ్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తే దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.