బాంబు దాడులు పిరికిపంద చర్య: కేసీఆర్

నాగరిక సమాజంలో బాంబు దాడికి పాల్పడమన్నది పిరికిపంద చర్య అని కేసీఆర్ ఆగ్రహంతో అన్నారు. నాగరిక సమాజం తలదించుకునేలా ఈ దాడి ఉందని ఆయన ఆవేదనతో చెప్పారు. ఇది పిరకితనానికి నిదర్శనమని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు మరోసారి జరుగకుండా కేంద్రప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.  ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై అంతర్జాతీయంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దిల్‌షుక్‌నగర్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్లలో గాయపడిన క్షతగాత్రులను టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరామర్శించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.