బహుజనులు ఏకమైతేనే రాజ్యాధికారం

బీసీ ఉపాధ్యాయుల సదస్సులోవక్తల పిలుపు
బహుజన సమూహాలు సంఘటితమైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. ఆదివారం రాత్రి నాగోల్‌లో బహుజన సామాజిక సాధికార వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ ఉపాధ్యాయుల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బహుజనులంతా ఐక్యంకావాలని, అందుకు ఉపాధ్యాయులు కీలక పాత్ర వహించాలన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు దూరం అవుతున్న విద్యను అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. సదస్సులో పాల్గొన్న ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ జీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆధిపత్య వర్గాలే రాజకీయాలను శాసిస్తున్నాయని, ఈ తరుణంలో బహుజన సమూహాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో కాకతీయ వర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ మురళి మనోహర్, అవేర్ పౌండేషన్ ఛైర్మన్ కటకం నర్సింగ్‌రావు, ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మోహన్‌సింగ్, ప్రొఫెసర్ డీ రవిందర్, తెలంగాణ హిస్టరీ సోసైటీ ప్రతినిధి సంగిశెట్టి శ్రీనివాస్, రుంజ విశ్వకర్మ రచయితలు, కళాకారుల వేదిక అధ్యక్షురాలు జ్వలిత, విశ్రాంత ప్రిన్సిపాల్ రాజేంవూదబాబు, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ ఛైర్మన్ ఓరుగంటి వెంక గౌడ్, మహబూబ్‌నగర్ మున్సిపల్ కమీషనర్ యాదగిరిరావు, సెక్ర ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మాచారి, గ్రేటర్ టీజేఏసీ కన్వీనర్ ఎంబీ కృష్ణాయాదవ్ పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.