బహిరంగ చర్చకు రెడీ.. మొగోనివైతే నువ్వూ రా.. బాబుకు కేసీఆర్ సవాల్

‘ఎవరి చరిత్ర ఏంటో జనానికి తెలుసు.. బాబు బహిరంగ సవాల్ ను స్వీకరిస్తున్నం.. మేం చర్చకు సిద్ధమే.. చంద్రబాబు.. నీకు దమ్ముంటే, మొగోనివైతే  బహిరంగ చర్చకు రా అంటూ కేసీఆర్ సవాల్ విసిరారు.  చంద్రబాబులా మందికి గోతులు తీయడం తనకు తెలియదని, బాబు చేసిన లఫోట్ పనులు ప్రపంచమంతా తెలుసని టీడీపీ అధినేతపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఫైర్ అయ్యారు. 14 ఏళ్ల ఉద్యమకాలంలో కేసీఆర్ ఏంచేశాడనేది ఈ దేశానికే ఎరుకని, తెలంగాణలో ప్రైమరీ స్కూల్ పిల్లాడిని అడిగినా చెబుతారన్నారు. చంద్రబాబు లెక్క తాను ఎన్నడూ లఫోట్ పనులు చేయలేదని, బాబులాంటి వికృత మనస్తత్వం ఎవరికీ లేదని ధ్వజమెత్తారు. నేనేం చేశానో ఎల్‌కేజీ పోరన్ని అడిగినా చెబుతారని అన్నారు. నేను నమ్మిన సిద్ధాంతాల కోసం పదవులను త్యాగా చేశానని పేర్కొన్నారు. నకిలీ ఎన్‌కౌంటర్‌ల పేరుతో ఎందరో యువకులను చంపించిన రక్త పిపాసి చంద్రబాబని, చంద్రబాబు చేసిన దుర్మార్గాలకు ప్రతి చర్య అలిపిరి వద్ద అనుభవించాడని ధ్వజమెత్తారు. కరెంట్ ఛార్జీలు తగ్గించమని అడిగిన జనాన్ని తుపాకులతో కాల్చి చంపిన ఘనుడు చంద్రబాబుదని మండిపడ్డారు.

బాబు అధికారం పోయింది టీఆర్‌ఎస్ వల్లే: కేసీఆర్
చంద్రబాబు నాయుడు అధికారం పోయింది టీఆర్‌ఎస్ వల్లే అని కేసీఆర్ బాధ అని అన్నారు. అందుకే నాపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని ఆరోపించారు. గత 14 ఏళ్ల నుంచి కేసీఆర్ ఏం చేస్తున్నాడో దేశ ప్రజలకు తెలుసని అన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఆర్నెళ్లు నిద్రపోతున్నాడని బాబు ఆరోపించడంపై కేసీఆర్ మండిపడ్డారు. ‘నేను ఎక్కడపంటే ఏంటీ. నేను రైతు బిడ్డను. వ్యవసాయం నాకు అలవాటు. అవును నేను ముందు నుంచే చెప్పినా, ఫాంహౌస్‌లో ఉంట, వ్యవసాయం చేసుకుంట, నా లైఫ్ నా ఇష్టం దానికి కీకెందుకు అంత అక్కసు అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కూర్చుని గోతులు తీయడం నాకలవాటు లేదు, నేను నీలాగా లఫంగ పనులు చేయడంలేదు. మా పెద్దలు ఇచ్చిన భూమి నాకు, నాకొడుక్కి కలిపి 64 ఎకరాల భూమి ఉంది. దున్నుకుని వ్యవసాయం చేసుకుంటున్నాం. తప్పా?’ అని ప్రశ్నించారు. ‘నేను బాబులా సింగపూర్ వెళ్లి ఆస్తులు లెక్కపెట్టుకోవడంలేదు. నాకు ఉన్న ఆస్తి అంతా నా ఫామ్‌హౌజే. చంద్రబాబు భార్య భువనేశ్వరీకి, కొడుకు లోకేష్‌కు ఎన్ని ఆస్తులున్నాయో భయటపెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యానని బాబు ఆరోపిస్తున్నారు కదా, మరి బాబు తనతో మాట్లాడరని పార్లమెంట్‌లో చిదంబరం చెప్పాడు మరి దానికి సమాదానమేంటని నిలదీశారు. తెలంగాణ సాధనలో నేనుంటే అవినీతి సాగడంలేదని బాబు బాధపడుతున్నారని ఆరోపించారు. నమ్మక ద్రోహం, అవకాశవాదం చంద్రబాబుకు సరిపోతాయని అన్నారు. చంద్రబాబు నీతిమంతుడైతే హైకోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు.

చంద్రబాబుకు దమాకుందా? : కేసీఆర్
రాష్ట్రాన్ని విభజించొద్దని, సమన్యాయమని, మరో న్యాయమని చంద్రబాబు అంటున్నాడు. అసలు సమన్యాయమంటే ఏంటో చంద్రబాబు ఎందుకు చెప్పడని కేసీఆర్ అన్నారు. అసలు సమన్యామనే ఆయనకేమైనా దమకుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలు ఓడించినా సిగ్గురావట్లేదా అని ప్రశ్నించారు. ఇక్కడ డిపాజిట్లు కోల్పోయినా ఇంకా బుద్ది రావడంలేదని అన్నారు. చరిత్ర వద్దని చరిత్రహీనుడయ్యాడని, వ్యవసాయం దండుగని రైతుల ఆగ్రహానికి గురయ్యాడని ఆరోపించారు. రైతులు ఉసురు పోసుకున్నాడని ఆరోపించారు. కరీంనగర్‌లో భిక్షపతి అనే రైతు చంద్రబాబు పాలన వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి చనిపోయిన విషయం బాబు మరిచిపోయినట్టు ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని బాబు కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నాడని ఆరోపించారు. తన గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఎక్కడిదని నిలదీశారు.

భిచ్చగాళ్లను దాచిన ఘన చరిత్ర నీది: కేసీఆర్
అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చినపుడు భిచ్చగాళ్లను దాచిపెట్టిన ఘన చరిత్ర చంద్రబాబుకు ఉందని కేసీఆర్ ఆరోపించారు. పోలీసులతో భిచ్చగాళ్లను ఉరికించలేదా అని ప్రశ్నించారు. బిల్‌క్లింటన్ చంద్రబాబు ముఖం మీద ఉమ్మివేసినట్టు మాట్లాడారని తెలిపారు. అంగన్‌వాడి కార్యకర్తలను, నిరుద్యోగులను గుర్రాలతో ఉరికించి కొట్టించాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడులాంటి ముఖ్యమంత్రి మా దేశంలో ఉంటే పిచ్చాసుపత్రిలోనో, జైళ్లోనో పెట్టేవాళ్లమని స్విట్జర్‌లాండ్ ఆర్థికమంత్రి అన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఇది తాను చెబుతున్న విషయాలు కాదని రికార్డులున్నాయని పేర్కొన్నారు.

ఢిల్లీలో దీక్ష ఎందుకు చేశావో తెలుసా?: కేసీఆర్
చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేయడంపై వ్యాఖ్యలు చేశారు. అసలు నీ దొంగ దీక్ష ఎందుకు చేశావో నీకు తెలుసా? అని ప్రశ్నించారు. ‘నేను బాజాప్త రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలిసి విషయం చెప్పి ఆమరణ దీక్ష చేసినా’ అని అన్నారు. మరి నీ దొంగ దీక్షలు ఎవరికోసమని నిలదీశారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసింది ఇంకా చాలలేదా? అని అన్నారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.