బన్సల్‌కు బంచుక్‌

atta

– మేనల్లుడి ముడుపులతో నాకు సంబంధం లేదు
– ప్రధానితో భేటీలో రైల్వేమంత్రి బన్సల్
– బన్సల్‌పై వేటువేయాలి.. ప్రతిపక్షాల డిమాండ్
– సీబీఐ కస్టడీకి బన్సల్ మేనల్లుడు విజయ్‌సింగ్లా
మేనల్లుడి ముడుపుల వివాదంలో చిక్కుకున్న రైల్వేశాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ రాజీనామాకు సిద్ధపడ్డారు. బన్సల్ శనివారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను ఆయన నివాసంలో కలిశారు. రైల్వేశాఖలో ఓ అధికారికి పదోన్నతి కల్పించేందుకు రూ. 90 లక్షలు లంచం తీసుకున్న ఆరోపణలపై తన మేనల్లుడి విజయ్‌సింగ్లాను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రధానికి తన వివరణ ఇచ్చారు. ఈ విషయంలో రాజీనామా చేసేందుకు సిద్ధమని బన్సల్ తెలిపినట్టు తెలిసింది. రేస్‌కోర్సురోడ్డులోని ప్రధాని నివాసంలో 20 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీ అనంతరం విషణ్ణ వదనంతో కనిపించిన బన్సల్ విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. బన్సల్ రాజీనామాకు సిద్ధపడిన విషయాన్ని కాంగ్రెస్ నేత జనార్దన్‌ద్వివేది ధ్రువీకరించారు. ‘‘రైల్వేమంత్రి.. ప్రధానికి తన వివరణ ఇచ్చి.. రాజీనామాకు సిద్ధపడ్డారు. నాకు తెలిసి.. అంతకుమించి ఆయనేమీ చేయగలరు’’ అని అన్నారు. అంతకుముందు మేనల్లుడి అవినీతి వ్యవహారంతో తనకు సంబంధం లేదని బన్సల్ స్పష్టంచేశారు. ‘‘సన్నిహిత బంధువు అయినప్పటికీ, అతను కానీ, ఇతర బంధువులు కానీ తన అధికారిక విధులలో తలదూర్చలేదు.

నా నిర్ణయాలను ప్రభావితం చేయలేదు’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవినీతి వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని, తాను ప్రజాజీవితంలో ఉన్నతమైన నిజాయితీని కనబర్చానని చెప్పారు. ఈ అవినీతి వ్యవహారంలో వేగవంతంగా సీబీఐ దర్యాప్తు జరపాలని అన్నారు. మహేశ్‌కుమార్ అనే రైల్వే అధికారి నుంచి రూ. 90 లక్షల తీసుకొని.. అతనికి రైల్వే బోర్డులో సభ్యుడిగా పదోన్నతి కల్పించనట్టు బన్సల్ మేనల్లుడు విజయ్‌సింగ్లా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ అయిన మహేష్‌కుమార్‌ను ఇటీవల రైల్వేబోర్డులో (స్టాప్) సభ్యుడిగా పదోన్నతి పొందారు. మేనల్లుడి ముడుపుల వ్యవహారంలో చిక్కుకున్న రైల్వేమంత్రి బన్సల్‌పై వేటు వేయాల్సిందేనని ప్రతిపక్షాలు ముక్తకం డిమాండ్ చేశాయి. ఆయనపై పదవి నుంచి తొలగించి, ఆయన పట్ల సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి. ఈ కేసులో బన్సల్‌పై దర్యాప్తు జరిపేవిధంగా రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించుకోవాలని బీజేపీ నేత రవిశంకర్‌వూపసాద్ విజ్ఞప్తి చేశారు.ఈ కుంభకోణం ‘రిటైల్ లంచా న్ని’ తలపిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అభివర్ణించింది. నైతిక విలువల ప్రాతిపదికన బన్సల్ రాజీనాయా చేయాల్సిందేనని యూపీఏ మిత్రపక్షం సమాజ్‌వాదీ పార్టీ పేర్కొంది. అయితే, బన్సల్ రాజీనామా చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది.

ఊగిసలాటలో బన్సల్ భవితవ్యం!
– నిర్ణయం తీసుకోని కాంగ్రెస్ కోర్‌కమిటీ
– నేడు మరోసారి భేటీ.. నిర్ణయం
మేనల్లుడి ముడుపుల వ్యవహారంలో ప్రతిపక్షాల నుంచి తీవ్రదాడిని ఎదుర్కొంటున్న రైల్వేమంత్రి బన్సల్ భవితవ్యం ఊగిసలాటలో పడింది. ఆయనను కేంద్ర కేబినెట్‌లో తొలగించాలా? వద్దా అనే విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఓ నిర్ణయానికి రాలేదు. ఈ విషయాన్ని చర్చించడానికి శనివారం ఢిల్లీలో భేటీ అయిన కాంగ్రెస్ కోర్‌కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా పాల్గొన్న ఈ భేటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన బన్సల్.. తన వాదనను వినిపించారు. మేనల్లుడి ముడుపుల వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పారు. అయితే రాజీనామా ప్రతిపాదనను మాత్రం ఆయన చేయలేదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కోర్‌కమిటీ ఆదివారం మరోసారి భేటీ అయి.. ఈ అంశంపై చర్చించనుంది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలోనే అంతకుముందే బన్సల్ భవితవ్యంపై ఓ నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. కాగా, బన్సల్ మేనల్లుడి ముడుపుల వ్యవహారంపై పలువురు కోర్‌కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. దీంతో అసంతృప్తి చెందిన బన్సల్ కోర్‌కమిటీ భేటీ మధ్యలోంచే వెళ్లిపోయారని సమాచారం. మేనల్లుడి ముడుపుల వ్యవహారంపై రైల్వేమంత్రి పార్లమెంటులో సమాధానమిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కోర్‌కమిటీ సభ్యులైన సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, కేంద్రమంవూతులు ఏకే ఆంటోని, చిదంబరం, సుశీల్‌కుమార్‌షిండే ఈ భేటీలో పాల్గొన్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.