బడ్జెట్ బాతాకానీ ముగిసింది. బడ్జెట్ హైలెట్స్ ను ఒకసారి చూద్దాం..
దర్బార్ కా బాద్ షా.. సీఎం కేసీఆర్
సభ సజావుగా సాగడంలో సీఎం కేసీఆర్ అన్నీ తానై వ్యవహరించిన్రు. మంత్రులను సమన్వయపరుస్తూ.. తానే స్వయంగా వ్యూహాలు రచించి.. ప్రత్యర్థులను చీల్చిచెండాడి హీరోగా నిలిచిన్రు. విపక్షాల అనుమానాలన్నింటికీ సమాధానం ఇచ్చి తనకెవరూ సాటిలేరనిపించుకున్నరు. టీడీపీ వాళ్లకైతే దిమ్మదిరిగి బొమ్మ కనిపించేలా చేసిండు. కొన్ని కొన్ని సార్లు సభలో కేసీఆర్ కనబడకపోతే ఎప్పుడు కనిపిస్తడా అని ఈగర్లీ వెయిట్ చేసిన పరిస్థితులూ ఉన్నయి.
ఈటెల రాజేందర్
బడ్జెట్ ప్రసంగం ఇరగదీసిండు. తన సహజశైలిలో ప్రసంగాన్ని కొనసాగించిన్రు. తమ ప్రభుత్వం మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ బలహీనవర్గాల పక్షపాత ప్రభుత్వమని.. ఇరిగేషన్ రైతాంగానికి పెద్దపీట వేసిన ప్రభుత్వమని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రప్రజలకు చాటడంలో సఫలమయిన్రు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిండన్నఏకైక త్రుప్తిని బీసీలకు మిగిల్చిండు.
హరీష్ రావు
శాసనసభా వ్యవహారాల మంత్రిగా హరీష్ సభను నడిపించడంలో సఫలమయిన్రు. ఓపిక నశించినా ముఖంపై చిరునవ్వును చెరగనివ్వకుండా ఎన్నిరోజులైనా చర్చకు తాము సిద్ధమంటూ ప్రకటన చేసిన్రు. సభ ఆర్డర్ లో లేని ప్రతీసారి హరీష్ చాకచక్యంతో వ్యహరించి సభా వ్యవహారాల మంత్రి పదవికి వన్నె తెచ్చిన్రు. భారీ నీటి పారుదల, విద్యుత్ శాఖలపై ఉభయసభల్లో గుక్క తిప్పుకోకుండా టకాటకా ఆన్సర్ చేసిన్రు. చెరువులపై జరిగిన చర్చలో సీనియర్ నేతల నుంచి అభినందనలు అందుకున్నరు. ఇక టీడీపీ వాళ్లతోనే తీస్ మార్ ఖాన్ అనిపించుకున్నడు.
కేటీఆర్
సహనం.. వినమ్రతతో సీనియర్ సభ్యుల మన్ననలు పొందిన్రు. మండలిలో, అసెంబ్లీలో ఎంతో హుందాగా ఓపికతో మెలిగిన్రు. తనకు కేటాయించిన శాఖలే కాకుండా పలుశాఖలపై ఫటాఫట్ సమాధానాలిచ్చిన్రు. ఒక కొశ్చన్ అడిగినోళ్లకు ఇంకో సందేహం రాకుండా అనుమానాలన్నీ తీర్చేసిండు. రాము తెలివైన మంత్రి అని అనిపించుకున్నరు..
జగదీష్ రెడ్డి, రాజయ్య, పోచారం, పద్మారావు, జోగు
బడ్జెట్ విషయంలో తమ శాఖలపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాలిచ్చిన్రు.
జానారెడ్డి
బడ్జెట్ పై వ్యంగాస్రాలను సంధించి అధికారపక్ష సభ్యులను నవ్వించిన్రు. ప్రణాళిక, ప్రణాళికేతర కేటాయింపులపై లెక్కలతో సహా పలు అభ్యంతరాలను వెలిబుచ్చిన్రు. బడ్జెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన్రు. బడ్జెట్ స్పీచ్ లో భేష్ అనిపించుకున్నా లీడర్ ఆఫ్ అపొజిషన్ గా విఫలమయిన్రు.
అక్బరుద్దీన్
మైనారిటీ సంక్షేమం కోసం అనేక సూచనలు చేసిన్రు. మైనారిటీల మన్ననలు పొందిన్రు. టీఆర్ఎస్ మైనారిటీల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను అభినందించిన్రు. ఆవేశపూరిత ప్రసంగం.. పిట్టకథలతో ఆకట్టుకున్నరు. ప్రభుత్వానికి అప్పుడే సపోర్ట్ చేసిండు. అప్పుడే రివర్స్ అయిండు.
లక్ష్మణ్
విద్యా వ్యవస్థ, రీ ఎంబర్స్ మెంట్, వర్సిటీల కేటాయింపులపై ఫోకస్ చేసి విద్యార్థుల మనస్సు గెలుచుకున్నరు. బీసీలకు బడ్జెట్ లో అన్యాయం జరిగిందని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమయిన్రు. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు, బీసీ పేదలకు కూడా కల్యాణ లక్ష్మి అమలు చేయాలని కోరిన్రు.
డీఎస్, ప్రొ. నాగేశ్వర్, అరికెల నర్సారెడ్డి, పాతూరి సుధాకర్ రెడ్డి
మండలిలో డీఎస్, ప్రొ.నాగేశ్వర్ విలువైన ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టిన్రు. అరికెల నర్సారెడ్డి చంద్రబాబు ఊసెత్తకుండా తెలంగాణ సమస్యలపైనే ఫోకస్ పెట్టిన్రు. పాతూరి సుధాకర్ రెడ్డి ప్రభుత్వం తరపున మిగతా సభ్యులకు సమాధానాలిచ్చిన్రు. పలు సమస్యలపై ఆయనే స్వయంగా ప్రశ్నలు అడిగి ప్రభుత్వం నుంచి సమాధానం పొందిన్రు.
ఓవరాల్
తొలి బడ్జెట్ లో అధికార పక్షం ఫర్ఫామెన్స్ అదిరింది. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైంది. టీడీపీ ఈ సెషన్స్ లో చంద్రబాబుకు డబ్బా కొట్టడానికే పరిమితమైంది. టీడీపీ నేతలు ఎంపీ కవిత విషయంలో నిరాధార ఆరోపణలు చేసి సభ చేత, ప్రజల చేత ఛీ కొట్టించుకున్నరు.