ఫేస్‌బుక్ చేతికి ఒకులాస్

న్యూఢిల్లీ : ప్రముఖ సామాజిక వెబ్‌సైట్ సర్వీసుల సంస్థ ఫేస్‌బుక్ కొనుగోళ్ల పర్వంలో దూసుకపోతున్నది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, వాట్స్ ఆప్‌లను కొనుగోలు చేసిన సంస్థ తాజాగా అమెరికా కేంద్రస్థానంగా వర్చ్యూవల్ రియాల్టీ టెక్నాలజీ సర్వీసులు అందిస్తున్న ఒకులాస్‌ను చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ రెండు బిలియన్ డాలర్లు. గడిచిన నెల రోజుల్లో ఇది రెండొ అతిపెద్ద కొనుగోలు. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో ఈ ఒప్పందం ప్రక్రియ ముగియనున్నదని తెలుస్తోంది

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.