ఫిబ్రవరిలో తెలంగాణ ఖాయం: హరీష్‌రావు

మహబూబ్‌నగర్: సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫిబ్రవరిలో తెలంగాణ ఏర్పాటు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. చెల్లని నాణానికి గీతలెక్కువ, కిరణ్‌కు మాటలెక్కువ చందంలా సీఎం మాటలున్నాయని ఎద్దేవా చేశారు. శ్రీధర్‌బాబు రాజీనామా చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతల పల్లకీలు మోసే తెలంగాణ నాయకులు ధర్‌బాబును చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.