అసెంబ్లీ ప్రొరోగ్తో తెలంగాణను అడ్డుకోవాలని చూడటం సీఎం కిరణ్ మూర్ఖత్వమని, లా చదివిన వ్యక్తి రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ధ్వజమెత్తారు. ఆదివారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ మంత్రులు ఇప్పుడు సత్తా చాటాల్సిన అవసరముందని, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్‌బాబు ప్రొరోగ్ ఫైల్‌పై సంతకం చేయకుండా వెనక్కుపంపి తెలంగాణపై ఉన్న ప్రేమ చాటుకోవాలని సూచించారు. రాష్ట్రాల విభజనపై కేంద్రానికే పూర్తి అధికారం ఉంటుందన్నారు. విభజనపై అసెంబ్లీని రెండుసార్లు అభిప్రాయం అడిగే సంప్రదాయం 1955కు ముందు ఉండేదని , బిల్లుపై మాత్రమే అభిప్రాయం తీసుకునే విధంగా సవరణ 1955లో జరిగిందని కోదండరాం గుర్తుచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను పునర్విభజించే పూర్తి అధికారం కేంద్రానికి ఉంటుందని, కిరణ్‌కుమార్ రెడ్డి చెపుతున్నట్లుగా 371- డీ అడ్డంకి కాబోదని అన్నారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తే రాష్ట్రం అభిప్రాయం చెప్పే అవకాశాన్ని కొల్పోతుందన్నారు. ప్రొరోగ్ చేసినాపది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలి. రాయల తెలంగాణకు ఒప్పుకొనేది లేదు. హైదరాబాద్, భద్రాచలం తెలంగాణలో ఉండాల్సిందే.
– దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి
అంక్షలు లేని పది జిల్లాల తెలంగాణ కావాలి. రాయల తెలంగాణకు అంగీకరించేదిలేదు. ఇదో కుట్ర, అధికార దాహం మాత్రమే.
– ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ఎల్పీ నేత
రాయల తెలంగాణకు ఒప్పుకొనేదిలేదు. ఆంక్షలు లేని పదిజిల్లాలు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణకే సమ్మతిస్తాం. ఇదంతా హైదరాబాద్‌పై పట్టుకోసం చేస్తున్న ఓ కుట్ర.
– కే తారకరామారావు, ఎమ్మెల్యే, సిరిసిల్ల
సీడబ్ల్యూసీ తీర్మానం ప్రకారం వెంటనే హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలి. రాయల తెలంగాణ, యూటీ గీటీ అంటే బీజేపీ పార్టీగా మేం
ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.
– నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్