ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ -ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నమస్తే తెలంగాణ పూర్వసంపాదకులు అల్లం నారాయణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

allamnarayana ప్రెస్‌  అకాడమీ పాలకమండలిని కూడా ప్రకటించింది. సభ్యులుగా టంకశాల అశోక్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్),  కే శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి సంపాదకులు), కట్టా శేఖర్‌రెడ్డి (నమస్తే తెలంగాణ సంపాదకులు), వీ మురళి (సాక్షి సంపాదకులు ), ఎం నారాయణరెడ్డి (టీ న్యూస్ సీఈవో), మల్లెపల్లి లక్ష్మయ్య (సీనియర్ జర్నలిస్టు), సీఆర్ గౌరీశంకర్ (డక్కన్ క్రానికల్), కే శ్రీనివాస్‌రెడ్డి (హిందూ రెసిడెంట్ సంపాదకులు), జహీరొద్దీన్ అలీఖాన్ (సియాసత్), వినయ్‌వీర్ (హిందిమిలాప్ సంపాదకులు), ఎన్ వేణుగోపాల్ (వీక్షణం సంపాదకులు),  కే అంజయ్య (సీనియర్ జర్నలిస్ట్ట్) నియమితులయ్యారు. వీరితోపాటు పాలకమండలిలో ప్రభుత్వ కార్యదర్శి (జీఏడీ), ప్రభుత్వ కార్యదర్శి (ఫైనాన్స్ అండ్ ప్లానింగ్), తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధిపతులు, దూరదర్శన్ డైరెక్టర్, ఆలిండియా రేడియో డైరెక్టర్, సమాచారశాఖ సంచాలకులు, ప్రెస్ అకాడమీ కార్యదర్శి సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ ఎక్స్‌అఫీషియో సెక్రటరీ చంద్రవదన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రెస్ అకాడమీలో తెలంగాణ యూనివర్సిటీ జర్నలిజం విభాగాన్ని కూడా చేర్చాలని జర్నలిస్టులు డిమాండ్‌ చేస్తున్నరు.
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం సార్‌కు సభ్యులైన టంకశాల సార్‌కు, కేఎస్‌ సార్‌కు, తెలంగాణ పత్రిక ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి సార్‌కు, తెలంగాణ చానల్ సీఈవో నారాయణరెడ్డి సార్‌కు మిగతా సభ్యులందరికీ పోరుతెలంగాణ తరపున అభినందలు..
ఇంత త్వరగా తెలంగాణ ప్రెస్‌ అకాడమీని ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. కానీ పాలకమండలిలో చేర్చిన తెలుగు యూనివర్సిటీ జర్నలిజం హెడ్, ఓయూ జర్నలిజం హెడ్ ఇద్దరూ ఆంధ్రావారయినందున..  ప్రభుత్వం పునరాలోచించాలని జర్నలిస్టులు విజ్ఞప్తి చేస్తున్నరు. తెలంగాణ యూనివర్సిటీ జర్నలిజం విభాగాన్ని ప్రెస్‌ అకాడమీలో భాగస్వామ్యం చేయాలని డిమాండ్‌ చేస్తున్నరు.
This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.