ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఫిబ్రవరి 10న ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఇచ్చి, మే 17న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూన్ 2న ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అదేవిధంగా మే 5న పీఈ సెట్, మే 10న ఈసెట్, మే 21న పాలిసెట్, మే 23న ఐసెట్, జూన్ 2న ఎడ్‌సెట్, జూన్ 8న లాసెట్, జూన్ 26 నుంచి 29 వరకు పీజీఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. 2014 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులుంటాయని ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.