ప్రపంచంలోనే టాప్‌.. తెలంగాణ డాక్టర్ శివలింగంగౌడ్‌

 

goud
– ఐబీసీ, కేంబ్రిడ్జి ప్రకటించిన వందమంది ప్రపంచ అత్యుత్తమ వైద్యుల్లో స్థానం..
– భారత్‌నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి డాక్టర్ ఎంఎస్ గౌడ్
– 17సంవత్సరాలుగా రాష్ట్ర గవర్నర్‌కు అధికారిక డెంటల్ సర్జన్
ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 100మంది అత్యుత్తమ వైద్య నిపుణుల్లో తెలంగాణకు చెందిన డాక్టర్ ఎం శివలింగం గౌడ్ (ఎంఎస్ గౌడ్) స్థానం దక్కించుకున్నారు. అంతేకాకుండా భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి కావడం గమనార్హం. ఇంటర్నేషనల్ బయోక్షిగాఫికల్ సెంటర్ (ఐబీసీ), బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జి యూనివర్సిటీలు సంయుక్తంగా ఎంపిక చేసిన ప్రపంచ టాప్ 100మంది హెల్త్ ప్రొఫెషనల్స్‌లో ఆయనకు చోటు దక్కింది. కాస్మొటిక్ విభాగంలో ఆయన ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ విభాగంలో ఆయన పంపిన పరిశోధన పత్రాలను ఐబీసీ ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ స్వీకరించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎంఎస్‌గౌడ్ జూన్ 28 నుంచి జూలై 3వరకు జరగనున్న ప్రపంచ సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం పంపింది. దేశంలోనే ఈ గౌరవం అందుకున్న మొదటి వ్యక్తి ఎంఎస్‌గౌడ్ కావడం విశేషం. ప్రస్తుతం ఆయన ఇండియన్ ప్రొస్తోడెంటిక్ సొసైటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ గవర్నర్‌కు 17 సంవత్సరాలుగా అధికారిక డెంటల్ సర్జన్‌గా కొనసాగుతున్నారు.

కాస్మొటిక్ దంతవైద్యంలో ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో పబ్లికేషన్లను తీసుకువచ్చారు. అదే సమయంలో సామాన్య వ్యక్తి దంతవైద్యం, దంతాలను కాపాడుకోవడంలో తీసుకోవాల్సిన సూచనలతో 7 పుస్తకాలను రచించారు. కాస్మొటిక్ దంతవైద్యాన్ని రాష్ట్రంలో మొదటిసారిగా ప్రవేశపెట్టింది కూడా ఎంఎస్ గౌడే. పళ్ల సందులను తొలగించడం, పళ్ల కరెక్షన్ వంటి చికిత్సలను అతి తక్కువ కాలంలో చేయగలగడం గౌడ్స్ క్లినిక్ ప్రత్యేకత. డెంటల్‌లో లేజర్ చికిత్సలు, ఆధునిక కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ ప్రక్రియను రాష్ట్రానికి తెచ్చిన ఘనత డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్స్‌కు దక్కుతుంది. ఇది వరకు రంగుమారిన పళ్లు, పళ్లమధ్య సందులు బాగు చేయడానికి కనీసం రెండుమూడు సిట్టింగులు పట్టేదని, ఆధునిక పరిజ్ఞానంతో ఒక్క సిట్టింగ్‌లోనే సరిచేయగలగుతున్నారు.

మన ఉస్మానియా డాక్టరే: గౌడ్ 1967లో ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి పట్టా పొందారు. దాదాపు 22 సంవత్సరాలపాటు ఉస్మానియా డెంటల్ కాలేజీలో పనిచేశారు. వీఆర్‌ఎస్ తీసుకున్న తరువాత ఆర్మీ డెంటల్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. కార్పొరేట్ ఆస్పవూతులకు ధీటుగా ఈ కాలేజీని నడిపామని ఆయన గర్వం గా చెబుతారు. హైదరాబాద్, సికింవూదాబాద్‌లో ఉన్న డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్స్‌ను ఎంఎస్ గౌడ్ కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. ఎంఎస్‌గౌడ్ కొడుకు, కూతురే కాకుండా, కోడ లు, ఆల్లు డు కూడా డెంటిస్టులు కావడం గమనార్హం. మానవత్వంతో తాము చేసే కొన్ని కార్యక్షికమాలు తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయని ఎంఎస్‌గౌడ్ చెప్పారు. ఐబీసీ అవార్డును అందుకోవడం తమ ఆస్పవూతులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ఎన్నో గౌరవాలు: అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ఫెలోషిప్
అమెరికన్ అకాడమీ ఆఫ్ కాస్మొటిక్ డెంటిస్ట్రీ ఫెలోషిప్
అమెరికన్ డెంటిస్ట్రీ ఫెలోషిప్
సౌత్ ఈస్ట్ ఏసియా డివిజన్ సభ్యత్వం
ఇండియాన్ ప్రొస్టాడాంటిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌరవం
ఆల్ ఇండియా డెంటల్ బాడీకి ఏపీ చాప్టర్‌కు అధ్యక్షుడిగా మొదటి తెలంగాణ డాక్టర్
1992లో ఇందిరాగాంధీ జ్ఞాపక జాతీయ పురస్కారం
1993లో మహాత్మాగాంధీ జాతీయ పురస్కారం
1996 ఉగాది తెలుగు వైభవ పురస్కారం
1997 ప్రపంచ తెలుగు వైభవ పురస్కారం
1997లో అంతర్జాతీయ డెస్టింగ్‌షెడ్ లీడర్‌షిప్ పురస్కారం.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.