ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పన్నడు?: నాగం

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోవడంపై తెలంగాణ నగారా సమితే అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. సమావేశాల తొలి రోజునే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేరని, ఆయన ఎక్కడున్నారని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో సమావేశాల మొదటి రోజునే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం సబబేనా అని ప్రశ్నించారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌లో చేరితే బాగుంటదని నాగం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ కూర్చునే కంటే ఆయనే కాంగ్రెస్‌లో చేరితే బాగుంటదని సలహా ఇచ్చారు. చంద్రబాబే కాంగ్రెస్‌లో కలిసేట్టు ఉన్నాడని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో ఉంది:నాగం
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని నాగం ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కొందరు తెలంగాణ ద్రోహులు ప్రయత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు. గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని ఎందుకు పొందుపరచలేదని ఆయన ప్రశ్నించారు. కాగా, తెలంగాణను గవర్నర్ నరసింహన్ అడ్డుకున్నది నిజంకాదా అని నాగం నిలదీశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.