ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించాలి: స్వామిగౌడ్

హైదరాబాద్: సీమాంధ్ర నేతలు తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ సీమాంధ్ర నేతలను కోరారు. విభజన బిల్లుపై మండలిలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడూతూ సీమాంధ్ర నాయకుల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తెలంగాణ ముసాయిదా బిల్లును స్వాగతిస్తున్నామని తెలిపారు. మొదటి నుంచి తెలంగాణకు అన్యాయమే జరుగుతోంది. ఆంధ్రరాష్ట్రంతో హైదరాబాద్ వీలనం కూడా మనస్ఫూర్తిగా జరగలేదు. ఒప్పందాలన్నింటిని ఉల్లంఘించారు. నీలం సంజీవరెడ్డి హయం నుంచే ఉల్లంఘనలు ప్రారంభమయ్యాయి. పెద్దమనుషుల ఒప్పందాన్ని ఆ తర్వాత పట్టించుకోలేదు. దీని ఫలితంగానే ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల సింటిమెంట్‌ను అందరూ గౌరవించాలని కోరారు. రాహుల్ కోసమే విభజన అనడం సరికాదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించాలన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.