ప్రత్యేక రాష్ట్రమే.. ప్యాకేజీలొద్దు

diry2013 ఇక రాజకీయ ప్రక్రియ ప్రారంభం కావాలి
– అధికార పార్టీ నేతలను కదిలించాలి
– ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచాలి: కోదండరాం
– ప్రజా ఉద్యమంతోనే తెలంగాణ సాధ్యం: కేకే
– తెలంగాణ ఇచ్చే బుద్ధి కేంద్రానికి లేదు: నారాయణ
– బాబూ.. దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేద్దాం: కిషన్‌డ్డి
– కలిసి పోరాడుదాం.. తెలంగాణ సాధిద్దాం
– తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణలో వక్తల పిలుపు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తప్ప ఎలాంటి ప్యాకేజీలను తెలంగాణ ప్రజలు ఆహ్వానించడం లేదని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్యాకేజీలంటే డ్రైనేజీలో పారబోసిన నీళ్లతో సమానమని, రీజినల్ కౌన్సిల్ వంటివి అసలే వద్దని స్పష్టం చేశారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన 2013 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్షికమం బుధవారం ఇందిరావూపియదర్శిని ఆడిటోరియంలో జరిగింది. సంఘం అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షత వహించిన కార్యక్షికమంలో కోదండరాంతోపాటు టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఎంపీ కే కేశవరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే నారాయణ, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్‌డ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్షికసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూర్యం, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కే స్వామిగౌడ్, తెలంగాణ ఎన్జీవో సంఘం చైర్మన్ దేవీవూపసాద్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఉద్యమంలో మూడేళ్ల కాలంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నెల రోజులు గడువు విధించినా ఉద్యమం ఆపేది లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రవూపభుత్వంపై ఒత్తిడి తీసుకరావడం వల్లనే అఖిలపక్ష సమావేశం జరిగిందని చెప్పారు. ఈ సమావేశం జరగడానికి కాంగ్రెస్ ఎంపీల కృషి ఉందని ప్రశంసించారు. తెలంగాణ కోసం రాజకీయ ప్రక్రియ ప్రారంభించేందుకు అధికార పార్టీ నేతలను కదిలించడంతోపాటు, ప్రతిపక్షాలపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు పాదయావూతపై తీవ్రంగా స్పందించారు. వందలాది మంది పోలీసుల సహకారంతో యాత్రలు జరుపుకుంటూ తెలంగాణ గురించి ప్రశ్నించేవారిని అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు.

రాజోలుబండను బద్దలు కొట్టిన టీడీపీ వారిపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాల కోసం పారిక్షిశామిక కేంద్రాల ఏర్పాటు గురించి చంద్రబాబు ఎందుకు ప్రస్తావించడం లేదని మండిపడ్డారు. ఆయన పాదయాత్ర సందర్భంగా 2500 మందిపై బైండోవర్ కేసులు పెట్టారని తెలిపారు. వీటి విషయంలో హోంమంవూతిని, డీజీపీని కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందన్నారు. హోంమంత్రి ఈ విషయాలు తనకు తెలియవని చెప్పారని ఆయన తెలిపారు. ప్రొఫెసర్లు రాజకీయాలు చేసున్నారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మాపై వ్యాఖ్యలు చేస్తున్న సీఎం, రాజకీయాలు చేస్తున్న పోలీసుల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సీమాంధ్ర పార్టీల నాయకులు ఏ పార్టీలో ఉన్నా వారందరూ ఒక తెలిపారు.

ప్రజా ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత కే కేశవరావు అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ప్రజలందరూ కథానాయకులేనన్నారు. ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోవాల్సిందేనని, హైదరాబాద్‌తో కూడుకున్న తెలంగాణ ఏర్పడాల్సిందేనని చెప్పారు. ఇప్పటికీ తెలంగాణకు అన్ని రంగాల్లోనూ అన్యాయమే జరుగుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం రావడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. రాష్టంలో లక్షల మంది ఉద్యోగులు కుటుంబసభ్యులతో సహా ఉద్యమానికి బలమైన మద్దతునిస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ ఇచ్చే బుద్ధి కేంద్రానికి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. అఖిలపక్షంలో ఏం జరిగిందో వివరించాలని కోరడంతో కాంగ్రెస్ నేతలు తనను అవకాశవాదిగా పేర్కొంటున్నారని చెప్పారు. తనను విమర్శించినా ఫర్వాలేదు కానీ అవకాశవాదినంటే ఒప్పుకోనని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేయడంలో ఎనలేని అనుభవం గడించిందని ధ్వజమెత్తారు. అన్ని రాజకీయ పార్టీలు ఐక్యతారాగం వినిపిస్తేనే తెలంగాణ సాధ్యమని, సీపీఐ తెలంగాణ అనుకూలమని ఎన్నో పర్యాయాలు స్పష్టం చేశామని చెప్పారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమతో కలిసి వస్తే ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌డ్డి సవాల్ విసిరారు. లేనిపక్షంలో బాబు ఎన్ని మాటలు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మే స్ధితిలో లేరన్నారు. తెలంగాణ అని రాసి ఉన్న బోనం ఎత్తుకోవడానికే మనస్సు ఒప్పలేదంటే ఆయన మనసులో ఏముందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణపై వచ్చిన ప్రకటన ఆధారంగా రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలని, కేంద్ర ప్రభుత్వం నెలరోజుల గడువు కోరిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యాచరణ ప్రకటించాలని తెలంగాణ ఎన్జీవో సంఘం చైర్మన్ దేవీవూపసాద్ డిమాండ్ చేశారు. ఆ పార్టీలు సజావుగా అడుగువేయని కారణంగానే తెలంగాణ ఆలస్యం అవుతోందని విమర్శించారు. జేఏసీలో ఎలాంటి గొడవలు లేవని, కొన్ని సీమాంధ్ర పత్రికలు కట్టుకథలు అల్లుతున్నాయని పేర్కొన్నారు

జేఏసీ అన్ని పార్టీలను కలుపుకుపోతుంది: ఈటెల
తెలంగాణ విషయంలో జేఏసీ అన్ని పార్టీలను కలుపుకుపోతుందని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణపై అనుకూల వైఖరిని సీపీఐ పలుమార్లు స్పష్టం చేసిందన్నారు. ఆ పార్టీ కార్యదర్శి నారాయణ దిష్టిబొమ్మను ఆంధ్ర ప్రాంతంలో దహనం చేస్తే.. తనపై పెట్రోల్ పోసి నిరసన తెలపాలని పేర్కొనడం హర్షణీయమని కొనియాడారు. తెలంగాణపట్ల చంద్రబాబు వైఖరి మాత్రం ఆ విధంగా లేదని విమర్శించారు. జై తెలుగుదేశం, జై తెలంగాణ అని రాసి ఉన్న బోనాలుంటే ఆయన మాత్రం జై తెలుగుదేశం బోనం ఎత్తుకొని తన మనసులోని మాటను బయటపెట్టారని మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని, అప్పుడే తెలంగాణ వస్తుందని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా భావవ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియలో భాగంగా పనిచేస్తేనే తెలంగాణ వస్తుందని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్ అన్నారు. భావవ్యాప్తిలో భాగంగా వందమంది కేసీఆర్, కోదండరాంలు తయారయ్యారన్నారు. ఆందోళనలో భాగంగానే సకల జనుల సమ్మె, తెలంగాణ మార్చ్ సాగిందన్నారు. ఇప్పుడు జరగాల్సింది రాజకీయ ప్రక్రియనేనని అన్నారు.

ఈ ప్రక్రియ ప్రారంభించకుంటే కాంగ్రెస్ మంత్రులు ఆ పార్టీని వీడాలని కోరారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నవారిని, ప్రతికూలంగా ఉన్నవారిని ఒకే కోణంలో చూడొద్దని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు స్వామిగౌడ్ అన్నారు. బాబు, జగన్‌ల వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం లేదన్నారు. వాళ్లు స్పష్టం చేస్తే వారిని ముఖ్యమంవూతులను చేద్దామా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం, బీజేపీ, న్యూ డెమోక్షికసీ కలిసినప్పుడు మిగిలిన పార్టీలు ఎందుకు జేఏసీలో కలవడం లేదని న్యూ డెమోక్షికసీ నేత సూర్యం ప్రశ్నించారు. ఈ కార్యక్షికమంలో తెలంగాణ కవి దేశపతి శ్రీనివాస్, తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.