ప్రతీ పోరాటం.. గ్రాండ్ సక్సెస్

Million-March పేరుతో పనిలేదు.. ఊరుతో పనిలేదు. లక్ష్యం మాత్రం అందరిదీ. తెలంగాణ ఎట్ల తెచ్చుకోవాలె.. తెలంగాణ కోసం ఇంకెట్లా కొట్లాడాలె అన్న ఆలోచనలే ఉద్యమకారులకు మార్గదర్శకాలవుతున్నాయి. అందువల్లే తెలంగాణ లక్ష్యసాధనలో ప్రతి పోరాటం విజయాన్ని ముద్దాడుతున్నది. ‘మా తెలంగాణ మాగ్గావాలే’ నినాదంతో పిలుపునిచ్చిన ప్రతి పోరాటంలోనూ తెలంగాణ సమాజం మొత్తం ఒక్కటై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సత్తాను చాటుతున్నది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ సమాజానికి సరికొత్త మార్గాన్ని చూపించింది. సమయం వచ్చినప్పుడు ఓట్లతో చూపించాలి.. మిగిలిన సమయాల్లో ఉద్యమాలు చేయాలన్న ఆయన వ్యూహాన్ని తెలంగాణ మొత్తం వంటబట్టించుకుంది.

డిసెంబర్ 9 తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ మొత్తం చైతన్యవంతమైంది. ఈమేరకు సీమాంధ్ర నేతల చెప్పుచేతల్లో ఉన్న కాంగ్రెస్ టీడీపీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేశారు. భారతదేశంలో మరే పార్టీ ఎమ్మెల్యేలకు రాని భారీ మెజార్టీలను తెలంగాణవాదులకు కట్టబెట్టా రు. ఎన్నికల బాటద్వారా టీఆర్‌ఎస్, బీజెపీ, సీపీఐ, న్యూ డెమోక్షికసీ వంటి పార్టీలు ఉద్యమానికి మద్దతిస్తుంటే.. విభిన్న పోరాటాలకు జేఏసీ మార్గదర్శకత్వం చేస్తున్నది. టీ జేఏసీ ఇచ్చిన మొదటి పెద్ద కార్యక్షికమం మిలియన్‌మార్చ్.. ట్యాంక్‌బండ్‌పై 10లక్షల మందిని రప్పించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష రూపాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో టీజేఏసీ ఘన విజయం సాధించింది. తెలంగాణ వ్యతిరేక సాంస్కృతిక పునాదులను పెకిలించే కార్యక్షికమం మిలియన్‌మార్చ్‌తోనే ప్రారంభమైంది. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో టీ జేఏసీ ఇచ్చిన మరో కార్యక్షికమం సాగరహారం. తెలంగాణ ప్రజల్లో మరోసారి ఉద్యమ కర్తవ్యాన్ని తట్టిలేపిన స్ఫూర్తివూపదాతగా పేర్కొనవచ్చు.

అసెంబ్లీలో, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల దుర్నీతిని ఖండిస్తూ సాగిన సాగరహారానికి నెక్లెస్ రోడ్ వేదికైంది. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నా.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అర్ధరాత్రి వరకు సాగిన సాగరహారం.. ప్రపంచ పోరాట చరివూతల్లో ఒకటిగా నిలిచింది ఇక సడక్ బంద్ ఇందులో ఉత్తర, దక్షిణ భారతదేశాలకు మధ్య సంబంధాలనే తెంచే విధంగా ఉద్యమం సాగింది. తాజాగా చలో అసెంబ్లీ కార్యక్షికమంలోనూ టీ జేఏసీ, అందులోని భాగస్వామ్య పార్టీలైన టీఆర్‌ఎస్, బీజెపీ, న్యూ డెమోక్షికసీ, మద్దతిస్తున్న సీపీఐ లాంటి పార్టీలు కలిసొచ్చి సంపూర్ణ విజయాన్ని సాధించాయి. రెండు మూడు రోజుల ముందు నుంచే హైదరాబాద్‌కు తరలివచ్చిన తెలంగాణవాదులు తమ ప్రతాపాన్ని చూపించారు. అసెంబ్లీ గేటును ముద్దాడేలా తెలంగాణవాదులు చేసిన పోరాటం తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరోసారి సాక్షాత్కరించింది. కనీవిని ఎరుగని నిర్బంధంలోనూ అసెంబ్లీ ఎదుట జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.