ప్రజాక్షేత్రంలో టీడీపీని ప్రజలు బొందపెడ్తరు: ఈటెల

హైదరాబాద్: రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శాసనసభలో చర్చ జరగకుండా ఆందోళనను కొనసాగిస్తున్న విపక్షాలపై తీరుపై ఆయన స్పందిస్తూ… రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలు వంటి తదితర అంశాలపై కూలంకశంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత 25 సంవత్సరాల లెక్కలు తీసి మరీ మాట్లాడుకుందాం. 25 వేల మంది రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్, టీడీపీయే కారణం.

టీడీపీ మూలాలు ఆంధ్రాలో ఉన్నయి. టీడీపీ సభ్యులు అభివృద్ధి నిరోధకులు. సభలో చర్చించాల్సిన అంశాలు చర్చకు రాకుండా టీడీపీ అడ్డుకుంటున్నది. ప్రజాక్షేత్రంలో టీడీపీని ప్రజలు బొందపెడ్తరు. ప్రభుత్వ పథకాలు పేదలకు చేరకుండా చేయాలనే టీడీపీ సభను సజావుగా జరగనివ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. వాయిదా తీర్మానాలపై చర్చించాల్సిందిగా కోరిన జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ నియమావళి ప్రకారం సభను జరుపుకుందాం. గతంలో ఎన్నడైనా ప్రశ్నోత్తరాలను పక్కనబెట్టి వాయిదా తీర్మానాలపై చర్చించిన దాఖలాలు లేవని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.