ప్రజల వల్లే అభివృద్ధి సాధ్యం : రాహుల్

ఛత్తీస్‌గఢ్ : ప్రజల వల్లే అభివృద్ధి సాధ్యమని తాము నమ్ముతున్నామని కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్‌నంద్‌గావ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. ప్రధాన మంత్రి వల్లే అభివృద్ధి సాధ్యమని బీజేపీ అంటోందని విమర్శించారు. దేశంలో అవినీతిని అంతం చేసేందుకు ఆర్టీఐ అనే శక్తివంతమైన ఆయుధాన్ని కాంగ్రెస్సే ఇచ్చిందని గుర్తు చేశారు. చత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ప్రభుత్వం అవినీతిలో ప్రపంచ రికార్డు సాధిస్తోందన్నారు. ఉపాధి కోసం అనేక మంది ప్రజలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వస్తున్నారని చెప్పారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.