ప్రజలు తెలంగాణను కోరుకుంటున్నారు: మల్లేశ్

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని సీపీఐ ఫ్లోర్ లీడర్ గుండా మల్లేశ్ తెలిపారు. డ్రాఫ్ట్ బిల్లుపై ఎవరి అభిప్రాయాలు వారు చెప్పొచ్చని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి జరుగుతుందని అంబేద్కర్ అన్నారని గుర్తు చేశారు. సీఎం రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి ఒక ప్రాంత వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.

తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం వస్తే ఆ వేడుకలను ఘనంగా జరపలేదని దుస్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణ పౌరులను రెండో తరగతి పౌరులుగా చూస్తున్నందుకే సీపీఐ పార్టీ విశాలాంధ్ర భావన నుంచి ప్రత్యేక తెలంగాణ వైపు వచ్చిందని పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.