ప్యాకేజీ ఆటలు ఇక సాగవు-కట్టా శేఖర్ రెడ్డి

ఒకసారి అందరినీ మోసం చేయవచ్చు. కొంతకాలం కొందరిని మోసం చేయవచ్చు. అన్నిసార్లు అందరినీ మోసం చేయడం అసాధ్యం. సీమాంధ్ర పార్టీలు ఒకసారి తెలంగాణ ప్రజలందరినీ మోసం చేశాయి. కొంతకాలం కొందరిని మోసం చేశాయి. ఇప్పుడు ఆ పార్టీల స్వభావం అందరికీ తెలిసింది. ఇంకా మోసం చేయడం సాధ్యం కాదు. కాంగ్రెస్‌కు ఒక అలవాటు ఉంది. అది అలవాటే కాదు వ్యూహం కూడా. గాలానికి ఎరను గుచ్చి చేపను ఆకర్షిస్తూ ముందుకు నడిపించినట్టు సమస్యను సజీవంగా ఉంచి జనాన్ని ఆకర్షించడం ఆ పార్టీ నైజం. చేప కదిలే కొద్దీ ఎర దూరంగా జరిగిపోతూ ఉంటుంది. ఈ ఆట ఎప్పటికీ ముగియదు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఆడుతున్న ఆట ఇటువంటిదే. ఎన్నికల దాకా ఈ సమస్యను ముంచకుండా తేల్చకుండా కొనసాగించడం, మరోసారి మోసపూరితమైన హామీలు లేక ప్యాకేజీలు ఇవ్వడం, ప్రజల్లో గందరగోళం సృష్టించడం ఆ పార్టీ లక్ష్యం. గులాం నబీ ఆజాద్ మాట్లాడుతున్నాడం తెలంగాణ ఇక ఇవ్వరని అర్థం. ఆయన ఏం మాట్లాడుతున్నా డో, ఎన్ని వంకరలు పోయాడో, తెలంగాణవాదులను ఎన్నిసార్లు అవమానించాడో, ఎవరి పక్షం వహిస్తున్నాడో ఈ పదేళ్లలో పదేపదే తేలిపోయింది. కానీ ఢిల్లీలో ఏదో జరుగుతోందన్న భావనను సజీవంగా ఉంచాలి, కాబట్టి ఒకరోజు నెలరోజుల్లో పరిష్కారం అని, మరో రోజు ‘క్లిష్టమైన సమస్య అంత తొందరగా తేలేది కాదని’ ఆయన చెబుతున్నారు. జానాడ్డి, చిరంజీవి, ఎఐసిసి అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్. ఇంకాఎవవ రో తెలంగాణ సమస్య కాంగ్రెస్ ఎజెండాలోనే ఉందని, 2014లోపే పరిష్కారమవుతుందని చెబుతుంటారు. అటువంటిదేమీ ఉండబోవ డం లేదని సీనియర్ ఐపిఎస్ అధికారి ఒక రు రాత్రి కుండబద్దలు కొట్టారు. కేంద్ర హోంశాఖలో తెలంగాణ సమస్యపై రకరకాల ప్రతిపాదనలు రూపొందిస్తున్నారట. అందులో ప్రధానమైనది ప్రస్తుతానికి తెలంగాణకు ప్యాకేజీ ప్రకటించడం. ప్యాకేజీ లో భాగంగా తెలంగాణకు అటానమస్ కౌన్సిల్ ప్రకటించ డం, నిధులు ప్రకటించడం, కొంతకాలం ఈ ప్రయో గం చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తారట. ఈ ప్రయోగాలన్నీ చేయడానికి యూపీఏ ఉంటే కదా! కానీ కాంగ్రెస్ ఈ ప్రయోగాల పేరుతో తెలంగాణ ప్రజల్లో మరికొంత మందిని మరికొంతకాలం మోసం చేయవచ్చునని, ఎన్నికల సమయం లో గందరగోళం సృష్టించి, కొన్ని స్థానాలయినా గెలవచ్చునని భావిస్తోంది. ప్యాకేజీ అంటే తెలంగాణ ఇవ్వకపోవడమే. పదేళ్లుగా తెలంగాణ ప్రజలకు ఇస్తున్న హామీలను తుంగలో తొక్కడమే, సీమాంవూధుల ఒత్తిళ్లకు తలొగ్గడమే. కాంగ్రెస్ అలాగే చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్ఠా నం గురుత్వాకర్షణ బలం ఢిల్లీలో లేదు. సీమాంవూధలో ఉంది. కాంగ్రెస్ సీమాంధ్ర నాయకత్వం అధిష్ఠానవర్గాన్ని సవాలు చేయగలిగారు, మభ్యపెట్టగలిగారు, ప్రలోభపెట్టగలిగారు, లొంగదీయగలిగారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఏమిచేసింది? ఏమి చేస్తున్నది? ఎలా వ్యవహరిస్తున్నది?

ఒక్క రోజయినా తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని సవాలు చేయగలిగా రా? అందరూ రాజీనామా చేసి సీమాంధ్ర ప్రభుత్వాన్ని వణికించిన సందర్భం ఒక్కటయినా ఉందా? ఒక్కరోజయినా కలసికట్టుగా ఢిల్లీ దర్బారులో తమ గళాన్ని వినిపించగలిగారా? అసలు వీరికి తెలంగాణ ప్రత్యేక డిమాండు ఎప్పుడూ కాలేదు. ఒకరు ముఖ్యమంత్రి పదవి కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇంకొకాయన తెలంగాణ కోటాలో హోంమంత్రి అయితే చాలనుకుంటారు. మరొకాయన పీసీసీ అధ్యక్ష పదవి అయినా రాకపోతుందా అని సోనియమ్మ జనపథంలో కాపలా కాస్తుంటారు. నిజంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తన సమర్థతను చాటుకున్నారు. బ్రిటిష్‌వాళ్లకంటే బాగా విభజించి పాలించగలిగారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలను ముక్కలు చెక్కలు చేసి తన చుట్టూ తిప్పుకోగలిగారు. ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలో అలా దారికి తెచ్చుకోగలిగారు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనకు అంగరక్షకులకంటే మిన్నగా కాపలా ఉంటారు. ఇంకొందరు ఆయన ఆత్మీయ బృందంలో సభ్యులుగా ఉంటారు. మరికొందరు ఆయన ఇచ్చిన తాయిలాలతో సంతృప్తిపడి పడిఉంటారు. చాలామందికి ముఖ్యమంవూతిమీద కోపం ఉన్నా తెగింపు లేక, ధైర్యం లేక పడి ఉంటా రు. ఆయనకు వ్యతిరేకులుగా ఉంటే సందులో మందుగా ఏదో ఒక పదవి రాకపోద్దా అని ఎదురు చూస్తుంటారు. తెలంగాణలో అన్ని పార్టీల ఎజెండాగా ఉన్న తెలంగాణ రాష్ట్ర డిమాండును ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి, బిజెపి, సిపిఐలకు పరిమితం చేయగలిగారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ టీడీపీ నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తెలంగాణ గురించి మాట్లాడడమే మానేశారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయితేనేం, మొదటి నుంచీ మంత్రిగా ఉన్న జానాడ్డికంటే, అపారమైన అనుభవం, జ్ఞానం ఉన్న జైపాల్‌డ్డి కంటే మొనగాడు అనిపించుకోగలిగాడు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఎన్ని గ్రూపులో! ఏ ఒక్కరికీ ఇంకొక్కరితో సరిపడదు. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్… అది కచ్చితంగా ముఖ్యమంత్రి విజయమే.

నిజానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతా కట్టగట్టుకుని తెలంగాణకోసం పోరాడుతుందని ఎవరికీ భ్రమల్లేవు. ఎప్పుడయినా కొందరు నేతలే నిలబడతారు, చోదక శక్తులవుతారు. 1969లో అంత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్‌లో చాలా మంది మంత్రులు ఉద్యమానికి మద్దతుగా ముందుకు రాలేదు. అప్పుడు ఇంకా ప్రలోభాలు, భయాలు ఎక్కువ. అయినా కొండా లక్ష్మణ్ బాపూజీ, మర్రి చెన్నాడ్డి, మదన్‌మోహన్ వంటి కొద్ది మంది సీనియర్ నాయకులే తెగించి పోరాడారు. తెలంగాణ సమాజాన్ని ఒక్కతాటిపై నిలబెట్టగలిగారు. అప్పుడు తెలంగాణలో ఉన్న పద్నాలుగు లోక్‌సభ స్థానాల్లో పది లోక్‌సభ స్థానాలను గెల్చుకుని కేంద్రానికి సవాలు విసరగలిగారు. ఇప్పుడు కూడా అలా జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? జానాడ్డి, జైపాల్‌డ్డి, సుదర్శన్‌డ్డి, దామోదర్‌డ్డి బ్రదర్స్, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ….వంటి వాళ్లు ఎవరయినా తెగించి ముందుకు వచ్చి ఉంటే తెలంగాణ సమస్య తేలిపోకపోయేదా? ఇద్దరు దళిత ఎంపీలు రాజీనామా చేస్తేనే ఢిల్లీ పెద్దలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తెలంగాణలో ఒక ప్రధాన సామాజిక వర్గానికి ప్రతినిధులుగా చెలామణిగా ఉన్న జైపాల్, జానాలు తిరుగుబాటు జెండా ఎగరేస్తే ఎటువంటి ప్రభావం ఉండేదో ఊహించవచ్చు. ‘మాసారు కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నాడు. అసెంబ్లీ సమావేశాల తర్వాత అటో ఇటో తేల్చుకుంటాడు’ అని జానాడ్డి అనుచరుడొకరు చెప్పారు. సకాలంలో నిర్వర్తించిందే ధర్మం. అవసరం లేనప్పుడు ఎంత గొప్ప ఆచరణ అయినా వృథా. ఢిల్లీలో కాంగ్రెస్ ఏదైనా చేయడానికి అవకాశం ఉన్నప్పుడు తేల్చుకోవాలి కానీ కాలం గడిచిపోయాక, తీరా ఎన్నికలు సమీపించాక అప్పుడు చించుతాను, పొడుస్తాను అంటే ఎవరు నమ్ముతారు? ఇది కూడా కాంగ్రెస్ లాగే ఎన్నికల సమయం లో తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఉపయోగపడుతుంది,తాము మరోసారి గెలవడానికి దోహదపడుతుంది తప్ప తెలంగాణ సాధనకు కాదు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దాటితే తెలంగాణపై చేయడానికి ఇంకేమీ ఉండదు. వర్షాకాల సమావేశాలు జూలై 26న మొదలై ఆగస్టు 27న ముగుస్తాయి. ఆ సమావేశాల్లోనే తెలంగాణ సమస్య ఒక కొలిక్కి రావాలి. లేదంటే మళ్లీ ఎన్నికల తర్వాతనే. తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు బిల్లును పార్లమెంటు ఆమోదించకుండా, ఇతరత్రా ఏ ఏర్పాట్లు చేసినా అవి ఆపద్ధార్మాలు, అధర్మాలే. వాటివల్ల తెలంగాణ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండ దు. ఆగస్టు తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ మొదలవుతుంది. నవంబరు-డిసెంబరు మాసాల్లో రాజస్థాన్, మధ్యవూపదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. వాటితోపాటే సార్వవూతిక ఎన్నికలు వస్తాయని వివిధ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అలా జరగకపోయినా సార్వవూతిక ఎన్నికలకు కూడా ఎంతో దూరం లేదు. 2009 సార్వవూతిక ఎన్నికలకు మార్చి 3వ తేదీన ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు. ఈసారి కూడా దాదాపు అదే సమయంలో ఎన్నికల ప్రకటనలు వెలువడతాయి. ఎన్నికల వేళ చేసేవి ఏవైనా తాత్కాలిక ఏర్పాట్లు ఉంటాయి తప్ప, శాశ్వత పరిష్కారా లు ఉండవు. అందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇదొక అవకాశం-నౌ ఆర్ నెవర్. తెలంగాణకోసం కొట్లాడడమో లేక తెలంగాణ ద్రోహులుగా తేలిపోవడమో-ఏదైనా వారి చేతుల్లోనే ఉంది. తెలంగాణ ప్రజలు ఇప్పుడు అధిష్ఠానాన్ని లేక కిరణ్‌కుమార్‌డ్డిని లేక సీమాంధ్ర నాయకత్వాలను నిందించదల్చుకోవడం లేదు. వాళ్లు తెలంగాణ ఇవ్వలేదు సరే. అడ్డం పడ్డారు సరే. కానీ తెలంగాణ సాధించడానికి తెలంగాణ ప్రజావూపతినిధులుగా ఉండి, కేంద్రం లో, రాష్ట్రంలో ప్రభుత్వానికి బోయీలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేశారన్నదే ప్రశ్న. ఇప్పుడు ప్రజల అందరి దృష్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రజావూపతినిధులపైనే ఉంది.హీరోలయినా జీరోలయినా వారే. తేల్చుకుంటారో చరివూతలో తేలిపోతారో వారిష్టం.

గొప్ప రాజకీయ సహకారోద్యమం
రాష్ట్రంలో గొప్ప సహకారోద్యమం నడుస్తోందని ఓ మిత్రుడు విశ్లేషించాడు. ‘ఇది రాజకీయ సహకారోద్యమం. జగన్‌కు వ్యతిరేకంగా కిరణ్‌కుమార్‌డ్డి, చంద్రబాబు నాయుడు సహకరించుకుంటారు. కిరణ్‌ను చంద్రబాబు కాపాడతారు. చంద్రబాబును కిరణ్‌కుమార్‌డ్డి కాపాడుతుంటారు. యాదృచ్ఛికమే అయినా ఇద్దరు ఒకే జిల్లా వారు. స్థానిక బలిమిని కోల్పోయి, హైదరాబాద్‌లో చక్రం తిప్పుతున్నవారు. మాటల్లో యుద్ధా లు చేస్తున్నట్టు కనిపిస్తుంది, చేతల్లో చేదోడువాదోడుగా ఉంటారు. విచిత్ర బంధం ఇది. చంద్రబాబు అనుకూల చానెళ్లు, పత్రికలు కిరణ్‌ను ఆకాశానికెత్తుతుంటాయి. కిరణ్ తెలంగాణను తిడితే పతాక శీర్షికలతో పులకించిపోతాయి. కిరణ్‌కుమార్‌డ్డి చానెళ్లు, పత్రికల సమయం ఆయనను పొగడడానికి, తెలంగాణవాదాన్ని తిట్టడానికి చాలడం లేదు. చంద్రబాబు జోలికి వెళ్లే సమయం వాటికి దొరకడం లేదు. కిరణ్, చంద్రబాబులకు వ్యతిరేకంగా జగన్‌మోహన్‌డ్డి టీఆస్‌కు మద్దతు ప్రకటిస్తారు. అందరూ ఏకమయ్యేది మాత్రం ఒక్క తెలంగాణ విషయంలోనే. తెలంగాణను వ్యతిరేకించే సందర్భం వస్తే, కిరణ్, జగన్, చంద్రబాబు నాయుడు, వారివారి చానెళ్లు, పత్రికలు పతాక శీర్షికలతో ఆనందతాండవం చేస్తుంటాయి. ఒక్కతాటిపై నిలబడి టీఆస్‌పైనే దాడి చేస్తుంటాయి. మీకు అర్థమవుతోందా?’ అని ఆయన నిలదీశారు. ఇందులో అర్థం కానిది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలకు ఇంత చిన్న విషయం అర్థం కాకుండా పోదు.

kattashekar@gmail.com

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.