ప్యాకేజీలంటే కాంగ్రెస్ ఖతం: హరీశ్‌రావు

కరీంనగర్: ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అంటూ రాష్ట్ర ఏర్పాటును సాగదీస్తున్న కాంగ్రెస్ ప్యాకేజీలిస్తామని ప్రకటిస్తే రాష్ట్రం లో ఆ పార్టీని ఖతం చేస్తామని ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. గురువారం కరీంనగర్ ఆర్టీసీ రీజియన్‌లోని ఎన్‌ఎంయూ కార్మికులు 400 మంది హరీశ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో టీఎంయూలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఉద్యమం చివరి వరకు చేరిందన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా రాయలతెలంగాణ, ప్యాకేజీలని మరి ఇంకేదో అంటూ కుట్రలు చేస్తే ఉద్యమం తీవ్రం చేస్తామన్నారు.

ప్యాకేజీ అంటే గడువుదాటిన మందులాంటిదని, దాని పెరెత్తితే కాంగ్రెస్ చస్తుందని హెచ్చరించారు. ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో కాంగ్రెస్‌లో గుబులు పుట్టిందన్నారు. ఢిల్లీలో తెలంగాణపై కదలిక వస్తే పొద్దున కిరణ్, రాత్రిళ్లు చంద్రబాబు కుట్రలతో అడ్డుకుంటున్నారన్నారు. వరద బాధితులను రక్షించ డంలో క్రెడిట్ కొట్టేసే క్రమంలో టీడీపీ, కాంగ్రెస్ నేతలు గల్లా లు పట్టుకుని తెలుగువాళ్ల పరువును బజారున పడేశారన్నారు. తెలంగాణ ఏర్పడితే మొదట లాభపడేది ఆర్టీసీ కార్మికులు, పోలీసులేనని చెప్పారు. సమావేశంలో టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌డ్డిపధాన కార్యదర్శి అశ్వత్థామడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తుల ఉమ పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.