డిసెంబర్ 16: తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతున్న వేళ సీమాంధ్ర శాసనసభ్యులు వ్యవహరించిన తీరుపట్ల తెలంగాణ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. పవివూతంగా వారు భావిస్తున్న తెలంగాణ బిల్లును సీమాంధ్ర ఎమ్మెల్యేలు చించివేయటం, కాల్చివేయడంపై తీవ్రంగా మండిపడి అడ్డుకున్నారు. దీంతో ఇరు ప్రాంతాల నేతల మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీలోనూ, కౌన్సిల్లోనూ, అలాగే మీడియా పాయింట్ వద్ద అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ శాసనసభ్యులు సీమాంధ్ర ఎమ్మెల్యేల వీరంగాలను కట్టడి చేశారు. సోమవారం ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు వచ్చిన సందర్భంగా తెలంగాణ బిడ్డలుగా ఈ ప్రాంత శాసనసభ్యులు తెలంగాణ తల్లిపై తమ ప్రేమను చాటుకున్నారు.
డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు జానారెడ్డి, డీ కే అరుణ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, భిక్షపతి, గంగుల కమలాకర్, భిక్షమయ్యగౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింలు, జైపాల్‌యాదవ్, రాములు, ఉమా మాధవడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, సీతక్క, మంచిడ్డి కిషన్‌డ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, విజయరమణారావు, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, కవిత, ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్డ్డితోపాటు మరికొందరు మహిళా శాసనసభ్యులు వీరోచితంగా వ్యవహరించారు. సోమవారం ఉదయం స్పీకర్ నాదెండ్ల మనోహర్ 10గంటలకు సభను వాయిదా వేశారు. అనంతరం రాష్ట్రపతి నుంచి వచ్చిన రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును వివరిస్తూ సభలో అసెంబ్లీ సెక్రటరీ రాజా సదారాం రాష్ట్రపతి లేఖను చదివి వినిపిస్తారని ప్రకటించారు. సదారాం రాష్ట్రపతి ఉత్తర్వును వివరిస్తుండగా తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఆయనకు రక్షణ కవచంగా నిలబడ్డారు. మహిళా ఎమ్మెల్యేలు ఒక వలయంగా నిలబడగా మిగిలిన ఎమ్మెల్యేలు వారి చుట్టూ నిలబడ్డారు.
మీడియాపాయింట్ వద్ద సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు దేవినేని ఉమ తదితరులు బిల్లు ప్రతులను చించివేస్తుండగా గంగుల కమలాకర్ దానిని చూసి తట్టుకోలేక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర నాయకులు ఈటెల రాజేందర్, భిక్షమయ్య, సుధాకర్‌రెడ్డి, భిక్షమయ్యగౌడ్ తదితరులు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సీమాంధ్ర శాసనసభ్యులను తీవ్రంగా వ్యతిరేకించారు. చింపే ప్రతులను తీస్కొని, బిల్లుకు నిప్పంటించే ప్రయత్నాలను అడ్డుకున్నారు. బిల్లుకు అక్కడికక్కడే పూజలు చేశారు. కౌన్సిల్లోనూ స్వామిగౌడ్ తదితరులు సీమాంధ్ర కౌన్సిల్ సభ్యుల వైఖరిని తీవ్రంగా నిరసించారు. దీంతో బిల్లుపై చర్చ జరిగి రాష్ట్రపతికి వెళ్లేవరకు టీ నేతలు కలిసికట్టుగా వ్యవహరిస్తారని సోమవారం పరిణామాలు రుజువు చేస్తున్నాయి.