పౌడర్‌ అద్దుడెక్కువ.. పనిచేసుడు తక్కువ..!!

ఎలక్షన్‌ అధికారులకు అమాసకు ఒకసారో.. పున్నమికి ఒకసారో పనుంటది. ఆ పని కూడా సరిగ్గా చేయకపోతే ఎట్లా.. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలక్షన్‌ అధికారులు దిద్దుకోలేని తప్పు చేసారు. అభ్యర్థుల పేరు ఒకటుంటే.. ఫొటో మరొకటి పెట్టారు.  పైగా వాళ్లిద్దరూ ఒకేలా ఉన్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌ లాల్‌ వ్యాఖ్యానించారు. మొదటి సారి కరెక్టే ఉన్నాయని.. రెండోసారి కరెక్షన్స్‌ మాత్రమే చూస్తామని.. ఫొటో చూడడం ఉండదని భన్వర్‌ లాల్‌ సెలవిచ్చారు. పై పెచ్చు మీ మీడియాలో తప్పులు రావా అని ప్రశ్నించారు. భన్వర్ జీ మేం తప్పుచేస్తే ఎన్నికలు వాయిదా పడవు.. మీరు తప్పు చేస్తే ప్రభుత్వానికి పైసలు బొక్క.. బార్లకు పైసలు బొక్క.. అభ్యర్థులకు మొత్తం బొక్క..

భన్వర్‌ లాల్‌ వల్ల ఇప్పుడు ఎన్నికలు 19కి వాయిదా పడ్డయి ..   ఇప్పుడు మళ్లీ ఫస్ట్‌ నుంచి ప్రచారం చేయాలి.. మళ్లీ పైసలు ఖర్చు పెట్టాలి.. నజీబ్‌ గారు ఈయనను ఎలిమినేట్ చేయండి సార్‌ అని ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఈసీకి మొరపెట్టుకుంటున్నారు.

భన్వర్‌ లాల్  ప్రెస్‌ మీట్‌కు వచ్చే ముందు పావుగంట పాటు మేకప్‌ వేసుకుంటారని సచివాలయం టాక్‌. దీంతో భన్వర్‌ లాల్‌ పౌడర్‌ అద్దుకోవడం ఎక్కువ.. పనిచేసుడు తక్కువని మీడియా ప్రతినిధులు సెటైర్లు వేస్తున్నరు.

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *