పోచారం రైతు బిడ్డ : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : వ్యవసాయ శాఖ మంత్రి పోచారం రైతుల ఆత్మహత్యలపై చేసిన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలియజేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతు బిడ్డ అని రైతుల సమస్యలు ఆయనకు తెలుసన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తప్పకుండా సమాధానం ఇస్తారని స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలపై తాను అలా మాట్లాడలేదని పోచారం ఉదయం తనకు చెప్పారని గుర్తు చేశారు. పోచారం అలా మాట్లాడి ఉండరని.. విపక్షాలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండా అమలు కోసం ఆందోళన చేశారని పేర్కొన్నారు.
This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.