పొత్తులతో మళ్లీ మోసపోం: కేసీఆర్

 

trs

ఎన్నికలయ్యాకేమద్దతుపై నిర్ణయంతెలంగాణ సాధనే
సింగిల్ ఎజెండామేలో అభ్యర్థుల
జాబితా ప్రకటన27న ఆర్మూర్‌లో
టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభచాలా మంది టచ్‌లో ఉన్నారు
టీఆర్‌ఎస్ అధినేత వెల్లడి
రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు టీఆర్‌ఎస్ అధ్యక్షులు కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశం నిర్ణయాలను, తీర్మానాలను వెల్లడించారు. ‘ఏ పార్టీతోనైనా పొత్తులపై సుముఖత లేదు, అలాగని విముఖత లేదు. ప్రేమ, కోపం లేదు. సమ్మతి, అసమ్మతి లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. ఒంటరిగానే పోటీ చేయడం శ్రేయస్కరమని పొలిట్‌బ్యూరో ఏకక్షిగీవంగా తీర్మానించినట్లు తెలిపారు. తెలంగాణకు అనుకూలమంటూ టీఆర్‌ఎస్‌తో పొత్తులు పెట్టుకొని వైఎస్, చంద్రబాబు సీట్లు గెలిచి మాట తప్పారని, తెలంగాణను మోసం చేశారని ఆయన గుర్తు చేశారు. మళ్లీ మోసపోయేందుకు సిద్ధంగా లేమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకే టీఆర్‌ఎస్ ఆవిర్భవించిందని, తమ సింగిల్ ఎజెండా తెలంగాణ సాధనేనని స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత ఏ పరిస్థితులు ఎదురైనా తమకు అనుకూలంగా మలుచుకుంటామని, ఆ వెసులుబాటు ఉంచుకుంటామని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీల విషయంలో, తెలంగాణను సాధించుకునే అంశంలో ఎవరికి మద్దతునివ్వాలో అప్పుడే నిర్ణయాన్ని తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే పొత్తులు పెట్టుకుంటే కట్టుబాట్లు, ఆటంకాలు ఏర్పడుతాయని, అలాంటి పరిస్థితులు రాకుండా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సీపీఐతో పొత్తు కట్టి ఎన్నికల్లో గెలిచాక తెలంగాణ కోసం ఎన్డీయేకు మద్దతునిస్తామంటే మతతత్వ పార్టీతో కలిసి రాలేమంటూ పేచీ పెడతారని, ఇలాంటి పరిస్థితులు రావద్దనే ఒంటరిగా పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ వేలాది ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయని చెప్పారు. సెక్యులర్ పార్టీగా తెలంగాణను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. మే నెల 15వ తేదీకి అటుఇటుగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని కేసీఆర్ వెల్లడించారు.

మే నెలలో పది బృందాలతో తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో శిక్షణ కార్యక్షికమాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరోలోకి ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన వరదాడ్డిని తీసుకుంటున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కనీసం 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు కేంద్రంలో టీఆర్‌ఎస్ చక్రం తిప్పే స్థాయికి చేరుకుంటుందన్నారు. అప్పుడు తమకు అనేక ఆఫర్లు వస్తాయని, అందులో బెటర్ ఆఫర్‌ను ఎంపిక చేసుకుంటామని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీల్లో ఏది అధికారంలోకి వస్తుందన్నది తమకు అప్రస్తుతమని ఆయన చెప్పారు. రానున్న కాలంలో ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. వచ్చేది మళ్లీ సంకీర్ణ యుగమేనని స్పష్టం చేశారు. ఈనెల 27న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగే టీఆర్‌ఎస్ 12వ ఆవిర్భావ సభలో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని సాగుతున్నవి ఊహాగానాలేనని చెప్పారు. అనవసరంగా గందరగోళాన్ని సృష్టించవద్దని ఆయన మీడియాకు సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు గత పన్నెండేళ్లుగా గులాబీ జెండాను మోస్తున్నామని అన్నారు. ఈ పన్నెండేళ్లలో ఎందరో మంది ముఖ్యమంవూతులు, అనేక మంది రాజకీయ నాయకుల దాడులను, విమర్శలను ఎదుర్కొన్నామని చెప్పారు. టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు చాలా మంది టచ్‌లో ఉన్నారని, వారం, పది రోజుల్లో భారీగానే వలసలు ఉంటాయన్నారు. చిన్న పార్టీ మద్దతుతో యూపీఏ ప్రభుత్వం కొనసాగుతోందని, అందువల్ల తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం కాంగ్రెస్‌పై లేదని చెప్పారు. మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణను నిండా ముంచిందే జవహర్‌లాల్ నెహ్రూ అని ఆయన ఆరోపించారు. ఫజల్ అలీ కమిషన్ సిఫారసులకు భిన్నంగా నెహ్రూ తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో విలీనం చేసి తప్పు చేశారని చెప్పారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తే ఇందిరాగాంధీ ఉద్యమకారులను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపించిందని విమర్శించారు. తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి మోసం చేస్తూ సోనియాగాంధీ రాచిరంపాన పెడుతున్నారని ఆరోపించారు. ఇలా మూడు తరాలుగా తెలంగాణను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న కేసీఆర్.. ‘రండి! ఆబిడ్స్‌లోనా?, టీవీ చానళ్లలోనా? చర్చిద్దాం’ అని సవాల్ విసిరారు.

27న ఆర్మూర్‌లో టీఆర్‌ఎస్ 12వ ఆవిర్భావ సభ
టీఆర్‌ఎస్ 12వ ఆవిర్భావ సభ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 250 మంది చొప్పున మొత్తం 30వేల మంది ప్రతినిధులు ఈ సభకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఆవిర్భావ సభ నిర్వహణ, ఏర్పాట్ల పర్యవేక్షణకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్‌డ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షతన సభ తీర్మానాల కమిటీని, మాజీ మంత్రి నాయిని నర్సింహాడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీని నియమిస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల కమిటీలో ఈటెల రాజేందర్, డాక్టర్ జీ విజయరామారావు, కెప్టెన్ లక్ష్మీకాంత్‌రావు, సిరికొండ మధుసూదనాచారి, అజ్మీరా చందులాల్, మహమూద్ అలీ సభ్యులుగా ఉంటారన్నారు. రెండు, మూడు సర్వేలు నిర్వహించి, జిల్లా కమిటీలను నుంచి నివేదికలను తెప్పించి, విశ్లేషించి తుది జాబితాను తనకు సమర్పిస్తారని, అందులో నుంచి తుది అభ్యర్థిని ఖరారు చేస్తామన్నారు. ఆర్మూర్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు జాతీయ మీడియాను కూడా ఆహ్వానించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర మీడియాను ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు.

అక్టోబర్, నవంబర్‌లలో ఎన్నికలు తథ్యం
కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలను కోరుకుంటోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశం అనంతరం ఆయన కొద్దిసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అదును చూసి యూపీఏ ప్రభుత్వానికి సమాజ్‌వాది పార్టీ మద్దతును ఉపసంహరించుకుంటుందన్నారు. దీంతో యూపీఏ ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం కోలుకోకుండా సమాజ్‌వాది పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోందని, దెబ్బ మిస్ అయితే సీబీఐ వేధింపులు తప్పవన్న ఆందోళన ఆ పార్టీలో వ్యక్తమవుతోందన్నారు. దేశంలో మధ్యవూపదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయని, ఆ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు. ఇది కాంగ్రెస్‌కు శరాఘాతంగా మారుతుందని చెప్పారు. దీన్నుంచి గట్టేక్కేందుకు కాంగ్రెస్ స్వయంగా ప్రభుత్వాన్ని కూల్చుకునే పరిస్థితులు తెచ్చుకొని అక్టోబర్, నవంబర్‌లలో ముందస్తు ఎన్నికలకు వెళుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు లేనే లేవని తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాతే స్థానిక ఎన్నికలు ఉంటాయని అంచనా వేశారు. రాష్ట్రంలోనూ ప్రభుత్వ పరిస్థితి ఏమీ ఆశజనకంగా లేదని, ఎప్పుడైనా, ఏమైనా జరగవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.