పేరు శాంతిభద్రతలే అయినా హైదరాబాద్ సరిహద్దులపైనే ప్రధాన చర్చ

హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల శిక్షాణా సంస్థకు చెందిన సుపరిపాలన భవన్‌లో ఐపీఎస్ లు, ఐఏఎస్ లు, మాజీ ఐపీఎస్ లతో ఇవాళ సెంట్రల్ టాస్క్‌పోర్స్ టీం  భేటీ అయింది. ఈ సమావేశంలో ఆస్తులు, ఎప్లాయిమెంట్,బెటాలియన్స్, పోలీస్ అకాడమీ, ఆక్టోపస్, సరిహద్దు అంశాలపై చర్చించామని బయటకు చెప్పినప్పటికీ హైదరాబాద్ సరిహద్దులపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.   అయితే ఈ సమావేశానికి తెలంగాణ అధికారులను, మాజీ అధికారులను పిలకవడం వెనుక కుట్ర ఉన్నదని..  హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రం పరిధిలోకి తీసుకునేందుకు విజయ్ కుమార్ టీం వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నయి.

పోలీసువిభాగంలో ఆస్తులను విభజించే అంశంపై చర్చించినట్లు మాజీ ఐపీఎస్ అధికారం విజయ్‌కుమార్ తెలిపారు.  ఇది ప్రాథమిక సమావేశం మాత్రమేనన్నారు. రేపు, ఎల్లుండి కూడా సమావేశమవుతామని ఆయన పేర్కొన్నారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.