పేరు చివర రెడ్డి, రావు, శర్మ ఉంటేనే పట్టించుకుంటరా? లేకుంటే పట్టించుకోరా?

 

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ కరీంనగర్ జిల్లా అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేరు చివర శర్మ, రెడ్డి, రావు ఉంటే తప్ప మీ కండ్లకు కనబడమా అంటూ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.   కరీంనగర్ జిల్లాకు సంబంధించిన డెవలప్ మెంట్ కార్యక్రమాలను తనకు తెలియజేయడం లేదని ఫైర్ అయ్యారు.  తన పార్లమెంట్ నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పెద్దపల్లి మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. సుమన్ శర్మ అనో సుమన్ రెడ్డి అనో, సుమన్ రావు అని ఉంటే గౌరవించేవారేమో అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.  ప్రివిలేజెస్ కమిటీకి కంప్లయింట్ చేస్తే అందరూ ఢిల్లీలో లైన్ లో నిలబడాల్సి వస్తదంటూ హెచ్చరించారు.

తెలంగాణ వచ్చాక ఇలాంటి ఘటనలు అంతమవుతాయనుకుంటే ఇప్పుడే కులాల పైత్యం, ఓ మూడు కులాల ఆధిపత్యం ఎక్కువవుతుందని  పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు.

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories, VIDEOS.

Comments are closed.