పేదలకన్నా దళారులకే లబ్ధి: శరద్ యాదవ్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆహాన భద్రత బిల్లుపై జనతాదళ్ మండిపడింది. ఈమేకు ఇవాళ లోకసభలో బిల్లుపై చర్చ సందర్భంగా ఆపార్టీ నేత శరద్‌యాదవ్ మాట్లాడారు. ప్రభుత్వం ముందు చూపు లేకుండా బిల్లు ప్రవేశపెట్టిందని ఆయన విమర్శించారు. ఈ బిల్లు వలన పేదలకన్న దళారులే ఎక్కుల లబ్ది పొందుతారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, అయినా వాటి ప్రతిఫలాలు వారికి అందలేక పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమని అన్నారు. ఈ బిల్లు కూడా అలాంటిదేనని తాను అభిప్రాయపడుతున్నానని స్పష్టం చేశారు.

వెనుకబడిన వర్గాలను పైకి తెచ్చే వరకు ఎన్ని పథకాలు తెచ్చినా లాభంలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పురోగమన దిశలో ఈ బిల్లు సాహసోపేతమైన చర్య అని ఆయన అభివర్ణించారు. దేశంలో ప్రస్తుతం గోడౌన్ల సామర్థ్యం 4 లక్షల టన్నులని ఆయన తెలిపారు. ఈ బిల్లు అమలు చేస్తే 6 లక్షల టన్నుల సామర్థ్యమున్న గోడౌన్లు అవసరమని ఆయన తెలిపారు. బీహార్‌లో ఈ పథకం అమలు చేయాలంటే రూ.600 కోట్లు అవసరమని ఆయన స్పష్టం చేశారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.